Ganesh Puja : బుధవారం ఇలా పూజ చేస్తే.. రోజంతా మీకు తిరుగుండదు!-pleasing ganesha every wednesday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganesh Puja : బుధవారం ఇలా పూజ చేస్తే.. రోజంతా మీకు తిరుగుండదు!

Ganesh Puja : బుధవారం ఇలా పూజ చేస్తే.. రోజంతా మీకు తిరుగుండదు!

Galeti Rajendra HT Telugu
Aug 14, 2024 04:32 AM IST

Lord Ganesha Puja: వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజున నిష్టతో పూజలు చేస్తే.. మన వ్యక్తిగత, కెరీర్ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దోషం ఉన్నప్పటికీ బుధవారం నిష్టతో పూజలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

గణేశుడి పూజ
గణేశుడి పూజ (Pixabay)

Lord Ganesha: హిందూ సంప్రదాయల ప్రకారం వారంలో ప్రతి రోజూ ఒక దేవుడు లేదా దేవతకి ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఈరోజు బుధవారం.. వినాయకుడికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని హిందువుల విశ్వాసం. సంప్రదాయబద్ధంగా గణేశుడిని ఈరోజు పూజించగలిగితే.. సకల శుభాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి.

పూజలో ఓం గ్లౌం గణపత్యే నమః మంత్రాన్ని పూజలో పలుమార్లు జపించి మీ మనసులో ఉన్నది కోరుకుంటే.. గణేశుడి అనుగ్రహం పొందవచ్చు. వృత్తి లేదా పరీక్షల్లో విజయం సాధించాలనుకునే వారు రోజులో మొదట భక్తి శ్రద్ధలతో గణేశుడిని పూజించాలి. దాంతో వారికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అలానే ఈరోజు కొన్ని వస్తువులను దానం చేస్తే మరీ మంచిదని పండితులు చెప్తున్నారు.

పచ్చని వస్త్రాలు లేదా పచ్చి వస్తువులు ఈరోజు దానం చేస్తే శుభం జరుగుతుంది. వివాహం అయిన మహిళకి పచ్చని గాజులు దానం చేయడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం ద్వారా విఘ్నాలు పూర్తిగా తొలగి.. మీరు అనుకున్నది సాధిస్తారని శాస్త్రం చెప్తోంది.

బంగారం ధరించి.. ఎరుపు జెండా

మనకి దోషం ఉన్నట్లయితే బుధవారం రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాత బంగారం ధరించడం ద్వారా దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అలానే దోషం దుష్ప్రభావాల్ని తగ్గించడానికి లేదా తొలగించడానికి ఇంటికి తూర్పు వైపున ఎరుపు రంగు జెండాను ఉంచితే మంచిదని శాస్త్రం చెబుతోంది.

ఆర్థిక సమస్యలు ఉంటే..?

మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. బుధవారం వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే లాభాదాయకంగా ఉంటుంది. జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉన్నా.. మీకు కచ్చితంగా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. వీలైతే బుధవారం వినాయకుడి గుడికి వెళ్లి గరికె గడ్డి లేదా లడ్డూను భక్తి శ్రద్ధలతో సమర్పించండి. మీకు ఆనందకరమైన జీవితాన్ని గణేశుడు ప్రస్తాదిస్తాడు.

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం ఊహలు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఇచ్చాం. HT Telugu ఏ సమాచారాన్ని అధికారికంగా ఆమోదించదు లేదా ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని మీరు అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.