పూజలో శంఖం ఎందుకు ఊదుతారు?

pixabay

By Gunti Soundarya
Aug 12, 2024

Hindustan Times
Telugu

హిందూ ధర్మం ప్రకారం పూజలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 

pinterest

శంఖం లక్ష్మీదేవికి ప్రతీకరమైన వస్తువు. పూజలో ఇది ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. 

pixabay

శంఖం నుంచి వచ్చే ప్రతిధ్వని పరిసరాల్లోని ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అందుకే మతపరమైన ఆచారాలు ప్రారంభించే ముందు శంఖం ఊదుతారు. 

pinterest

శంఖం ఊదటం అంటే దేవతలను ఆహ్వానిస్తున్నట్టు అర్థం. ఇది భక్తుడికి, దైవానికి మధ్య సంబంధం ఏర్పరుస్తుంది. 

pexels

శంఖం నుంచే వచ్చే శబ్ధం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. గాల్లోని మలినాలను శుభ్రపరుస్తుంది. సానుకూల శక్తిని నింపుతుంది. 

pinterest

శంఖంలో పోసిన తీర్థం తీసుకుంటే సర్వరోగాలు నయమవుతాయని విశ్వసిస్తారు. 

pinterest

అలాగే శంఖుతీర్థం ఇంట్లో అన్ని వైపులా చల్లడం వల్ల వాస్తు దోషాలు తొలగుతాయి. 

unsplash

శంఖాన్ని శివుడి పూజలో మాత్రం ఉపయోగించకూడదు. ఎందుకంటే శంఖచూడుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. ఆ రాక్షసుడి భార్య తులసి దేవి. 

unsplash

అందుకే శివుడి పూజలో శంఖం ఊదరు తులసి ఆకులు సమర్పించరు. 

unsplash

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash