Ananta kala sarpa dosham: అనంత కాల సర్ప దోషం అంటే ఏంటి? దీని ప్రభావం ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది?-what is ananta kala sarpa dosham and effects and remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ananta Kala Sarpa Dosham: అనంత కాల సర్ప దోషం అంటే ఏంటి? దీని ప్రభావం ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది?

Ananta kala sarpa dosham: అనంత కాల సర్ప దోషం అంటే ఏంటి? దీని ప్రభావం ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది?

Gunti Soundarya HT Telugu
Jun 29, 2024 05:48 PM IST

Ananta kala sarpa dosham: అనంత కాల సర్ప దోషం అంటే ఏంటి? దీని ప్రభావం ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది. నివారణ చర్యలు ఏంటి అనే వివరాల గురించి తెలుసుకుందాం.

అనంత కాలసర్ప దోషం అంటే ఏమిటి?
అనంత కాలసర్ప దోషం అంటే ఏమిటి? (pixabay)

Anant kala sarpa dosham: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గ్రహాలు, నక్షత్రాల స్థానం ఆధారంగా అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. వీటి ప్రభావం ప్రజల జీవితాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల ఏర్పడే అనేక అశుభ యోగాలలో అనంత కాల సర్పదోషం ఒకటి.

ఇది జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనంత కాల సర్ప దోషం ఎవరి జాతకంలోనైనా ఏర్పడుతుంది. మొత్తం ఏడు గ్రహాలు రాహువు, కేతువుల చుట్టూ ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ దోషం ఉన్న వ్యక్తుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మొదలైనవి వస్తాయి. జాతకంలో రాహు,కేతువులు ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఇతర గ్రహాలు వారి చుట్టూ ఉన్నప్పుడు ఈ అనంత కాల సర్ప దోషం ఏర్పడుతుంది.

దీనివల్ల ఎదురయ్యే సమస్యలు

అనంత కాల సర్ప దోషం ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. దోషం దుష్ప్రభావాల వలన మరణం కూడా సంభవించవచ్చు. వ్యాపారాలలో నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.

నివారణ చర్యలు

జాతకంలో అనంత కాల సర్పదోషం ఏర్పడటం వల్ల శ్రమకు అనుకూలమైన ఫలితాలు పొందలేరు. నిధుల కొరత ఎదుర్కొంటారు. ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. అందులో ఒకటి ఈ సింపు చిట్కా. ఒక ఇనుప ముక్కని తీసుకుని దానికి పేరు పెట్టి 43 రోజులపాటు నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

అనంత కాల సర్ప దోషాన్ని వదిలించుకునేందుకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చర్యలు ఉన్నాయి. పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది. రావి చెట్టుకు పూజలు చేయాలి. దేవుడికి కొబ్బరికాయ సమర్పించి గాయత్రి మంత్రాన్ని జపించాలి.

ఈ పనులు చేయొద్దు

జాతకంలో అనంత కాల సర్వ దోషము ఉన్నట్లయితే వాళ్ళు సిగరెట్, మద్యం, పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీలం నలుపు గోధుమ రంగుల వాడకాలు తగ్గించాలి. వాటి స్థానంలో ప్రకాశంవంతమైన రంగు దుస్తులు ధరించాలి. సెకండ్ హ్యాండ్ వస్తువుల వాడగానే నివారించాలి. భాగస్వామ్య వ్యాపారం చేయడం మంచిది కాదు.

అనంతకాల సర్పదోష ప్రభావాలు

ఈ దోషం వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యక్తుల వివాహంలో అడ్డంకులను కలిగిస్తుంది. వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈ కారణంగా వారిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. భాగస్వాముల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది వైవాహిక బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అనంతకాల సర్పదోషం అననుకూల ప్రభావాల కారణంగా వివిధ ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటారు. సంతానం కనే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel