Marriage: వివాహం ఆలస్యం అవుతుందా? అయితే మీ జాతకంలో ఈ గ్రహాలు బలపడేందుకు ఇలా చేయండి-will marriage be delayed do this to strengthen these planets in your horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage: వివాహం ఆలస్యం అవుతుందా? అయితే మీ జాతకంలో ఈ గ్రహాలు బలపడేందుకు ఇలా చేయండి

Marriage: వివాహం ఆలస్యం అవుతుందా? అయితే మీ జాతకంలో ఈ గ్రహాలు బలపడేందుకు ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu

Marriage: వివాహం ఆలస్యం అవుతుందా? ఎన్ని సంబంధాలు చూసినా కొంతమందికి వివాహం కుదరడం లేదా? పెళ్లి అనుకోగానే అనేక సమస్యలు చుట్టుముట్టి జాప్యం జరుగుతూ ఉంటుందా? అందుకు ఈ గ్రహాల స్థానాలు కూడా కావచ్చని పండితులు చెబుతున్నారు.

వివాహం ఆలస్యం అవుతుందా? (Unsplash/@kography)

Marriage: ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ సరైన సమయంలో, సరైన వయసులో వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అందుకు తగినట్టుగా వివాహ సంబంధాలు వెతుకుతారు. కానీ పెళ్లి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ వస్తారు. వివాహం ఆలస్యం అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెళ్లి ఆలస్యం కావడానికి వివిధ కారణాల్లో ఒకటి గ్రహదోషాలు.

జన్మరాశిలో అనేక గ్రహాలు వివాహ సంబంధిత విషయాలలో సమస్యలు సృష్టిస్తాయి. ఈ గ్రహాలను స్థానాలు సరిగా అర్థం చేసుకోగలిగితే వాటికి సంబంధించి జ్యోతిష్య పరిహారాలు పాటించవచ్చు. అప్పుడు వివాహంలో ఎదురయ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆ గ్రహాలు ఏమిటి? వాటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందాం.

పెళ్లిలో అడ్డంకులు కలిగించే గ్రహాలు ఇవే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ చార్ట్ లో ఏడవ ఇంట్లో దశ లేదా అంతర్దశ ఉన్నప్పుడు ఆరో ఇంటికి సంబంధించి అంతర్దశ ఉన్నప్పుడు వివాహంలో జాప్యం జరుగుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఆరు లేదా పదో ఇల్లు వివాహంలో సమస్యలు సృష్టిస్తుంది. అలాగే శని సప్తమంలో ఉన్నా కూడా వివాహంలో జాప్యం జరగవచ్చు.

ఈ గ్రహాల కలయిక వివాహాన్ని ఆలస్యం చేస్తుంది

జాతకంలో కుజుడు, రాహువు, కేతువులు ఏడో ఇంట్లో ఉంటే వారి వివాహం ఆలస్యం కావచ్చు. అలాగే 7, 8 ఇంట్లో శని- అంగారకుడు, శని- రాహువు, కుజుడు- రాహువు లేదా శనీశ్వరుడు- సూర్యుడు, అంగారకుడు- సూర్యుడు, సూర్యుడు- రాహువు కలయిక ఉన్నప్పుడు కూడా వివాహంలో సమస్యలు కలుగుతాయి.

మంగళక దోషం మరొక కారణం

పెళ్లి ఆలస్యం అయ్యేందుకు అతిపెద్ద కారణాల్లో ఒకటి కుజ దోషం .ఒక వ్యక్తి జీవితంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. బృహస్పతి లేదా మరి ఏదైనా శుభగ్రహం సప్తమ లేదా 12 ఇంట్లో ఉండటంతో పాటు చంద్రుడు బలహీనంగా ఉంటే వివాహానికి ఆటంకాలు ఏర్పడతాయి.

జాతకంలోని కొన్ని గృహాలు కూడా వివాహానికి బాధ్యత వహిస్తాయి. ఏడవ ఇల్లు వివాహ గృహం, శుభ గ్రహం లేదా అధి దేవతలకు అధిపతి. బృహస్పతి లేదా శుక్రుడు సరైన స్థానంలో లేకపోతే వివాహం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంటే 25 సంవత్సరాల వయసులో వివాహం జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు సరిగా లేకపోతే వారికి ఏడాదిన్నర పాటు వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే రాహు లేదా శని ప్రభావం ఉంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు వివాహం ఆలస్యం అవుతుంది.

వివాహంలో వచ్చే సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని నివారణలు పాటించడం మంచిది. ఇలా చేయడం వల్ల పెళ్లి విషయంలో జరిగే జాప్యాన్ని తగ్గించుకోవచ్చు.

శివలింగాన్ని పూజించాలి

చాలా కాలంగా వివాహ విషయంలో జాప్యం ఎదుర్కొంటున్నట్లయితే మీరు శివలింగాన్ని పూజించాలి. ఇది మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా గణేష్ ని పూజించాలి. త్వరగా వివాహం అయ్యేలాగా విష్ణువు, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. వారికి ఖీర్ ప్రసాదంగా సమర్పించాలి.

పార్వతి దేవికి వివాహ వస్తువులు సమర్పించాలి

వివాహంలో బృహస్పతి, కుజుడు, శని గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే సవాటిని ంతపరిచేందుకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం ఉపవాసం పాటించాలి. శివుడితో పాటు పార్వతి దేవిని పూజించాలి. అలాగే పార్వతి దేవికి వివాహానికి సంబంధించిన వస్తువులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వివాహానికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.

మంగళ దోషం నివారణ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ చార్ట్ లో మంగళ దోషం ఉంటే వారి వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అంగారకుడి చెడు ప్రభావం తగ్గాలంటే మంగళవారం నాడు ఉపవాసం ఉండాలి. హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. హనుమంతుడికి లడ్డూలు సమర్పించాలి. అలాగే హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది.

గురువారం ఉపవాసం పాటించాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవతల అధిపతి బృహస్పతిని వివాహ గ్రహంగా పిలుస్తారు. బృహస్పతి బలహీనమైన స్థితిలో ఉంటే పెళ్లి చేసుకునేందుకు అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే బృహస్పతి స్థానం మెరుగుపరిచేందుకు పసుపు బట్టలు ధరించి గురువారం విష్ణుమూర్తిని పూజించాలి. పప్పు, అరటిపండు, పసుపు, కుంకుమ వంటి వస్తువులు దేవుడికి సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది. వీలైతే 11 లేదా 21 గురువారాలు ఉపవాసం ఉంటే ఫలితం లభిస్తుంది.

గుప్త దానాలు చేయాలి

వివాహంలో సమస్యలు ఉంటే ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా గుప్త దానాలు చేయవచ్చు. ఈ పరిహారం వివాహంలో వచ్చే అన్ని సమస్యలను పరిష్కరించగలదని పండితులు సూచిస్తున్నారు. రహస్యంగా దానం చేయడం వల్ల జాతకంలో రాహువు స్థానం కూడా బలపడుతుంది.

శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించాలి

వివాహానికి ఆటంకం కలుగుతుంటే దాని నుంచి బయటపడేందుకు ప్రతి శనివారం శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించాలి. ఇది చాలా ఫలవంతమైనది. అంతేకాకుండా శనివారం నాడు నల్లని వస్త్రంలో నల్ల మినపప్పు, ఇనుము, నల్ల నువ్వులు, సబ్బు పెట్టి దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది.

రాధాకృష్ణుల చిత్రాన్ని ఉంచుకోవాలి

జ్యోతిష్యులు సూచించిన విధంగా వివాహానికి ఆటంకాలు ఎదురుపడుతుంటే పడకగదిలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.