Budha pradosha vratam: రేపే బుధ ప్రదోష వ్రతం.. ఇలా పూజ చేసి పరిహారాలు పాటిస్తే శని దోషం నుంచి విముక్తి
Budha pradosha vratam: బుధవారం నాడు ప్రదోష వ్రతం వస్తే దాన్ని బుధ ప్రదోష వ్రతం అంటారు. ఇది శివునికి అంకితం చేసిన రోజు. జూన్ 19 బుధ ప్రదోష వ్రతం వచ్చింది. పూజా విధానం, శుభ ముహూర్తం, పఠించాల్సిన మంత్రాలు, పాటించాల్సిన పరిహారాలు ఇక్కడ తెలుసుకోండి.
Budha pradosha vratam: హిందూ మతంలో ప్రదోష వ్రతం రోజున శివపార్వతులను పూజిస్తారు. ప్రదోష వ్రతం రోజున భోలేనాథ్‌ను పూజించడం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారని నమ్ముతారు: మహాదేవుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని, ఆనందం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు.
ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ప్రదోష వ్రతం పాటిస్తారు. పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని రెండవ ప్రదోష ఉపవాసం జూన్ 19వ తేదీ వచ్చింది. ఈరోజు బుధవారం కావడం వల్ల దీన్ని బుధ ప్రదోష వ్రతం అంటారు. ప్రదోష వ్రతం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆచరిస్తారు.
బుధ ప్రదోష శుభ సమయం
త్రయోదశి తిథి ప్రారంభం – జూన్ 19, 2024 ఉదయం 07:28 గంటలకు
త్రయోదశి తేదీ ముగుస్తుంది - జూన్ 20, 2024 ఉదయం 07:49 గంటల వరకు
ప్రదోష పూజ ముహూర్తం - 07:22 PM నుండి 09:22 PM వరకు
పూజా విధానం
స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. మీశివపార్వతులను ఆరాధించాలి. ఉపవాసం చేయాలనుకుంటే మీ చేతిలో పవిత్ర జలం, పువ్వులు, అక్షతలతో ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలి. తరువాత సాయంత్రం, సంధ్యా సమయంలో ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించండి. తర్వాత శివాలయంలో లేదా ఇంట్లో శివునికి అభిషేకం చేసి ఆచరానుసారం పూజ చేయాలి. బుధ ప్రదోష కథ వినాలి. ఆ తర్వాత నెయ్యి దీపంతో శివునికి హారతి ఇవ్వాలి. ఓం నమః శివాయ, శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాలు పఠించాలి.
శనిదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయండి
ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశులలో శని సడే సతి, వృశ్చిక, కర్కాటక రాశులలో శని దయ్యా జరుగుతోంది. శనీశ్వరుడి సడేసతి, దయ్యా ప్రభావం ఉంటే వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటి నుంచి ఉపశమనం పొందటం కోసం ప్రదోష వ్రతం పూజ చేయడం చాలా ఉత్తమం. శివుడి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందేందుకు శివలింగానికి కొన్ని వస్తువులతో అభిషేకం చేయడం మంచిది. ఇలా చేస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు.
పెరుగు: శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా వ్యక్తి పరిణతి చెందుతాడు. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతాడు.
దేశీ నెయ్యి: శివలింగానికి స్వచ్చమైన ఆవునెయ్యి సమర్పించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు పొందుతారు. మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఒక వ్యక్తి బలవంతుడు అవుతాడు.
చందనం: శివలింగంపై చందనాన్ని రాయాలి. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి ఆకర్షణీయమైన రూపాన్ని పొందుతాడు. జీవితంలో ఎప్పుడూ గౌరవం, కీర్తికి లోటు ఉండదు.
తేనె: శివలింగానికి తేనె కూడా సమర్పించాలి. ఇలా చేస్తే మాటల్లో మాధుర్యం వస్తుంది. హృదయంలో దాన భావాన్ని మేల్కొల్పుతుంది.
గంజాయి: శివుడికి ఎంతో ప్రీతికరమైన పదార్థం ఇది. అందుకే శివలింగానికి భంగ్ సమర్పించవచ్చు. శివుడికి గంజాయిని నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
నీరు: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శివలింగంపై నీటిని సమర్పించడం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం నమః శివాయ అని జపించేటప్పుడు శివలింగంపై నీటిని సమర్పించండి. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
పాలు: శివలింగానికి పాలు సమర్పిస్తే శివుడు ప్రసన్నుడయ్యాడు. మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పాలు సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, వ్యాధి బాధలు లేకుండా ఉంటాడు.
చక్కెర: శివలింగానికి పంచదార సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పంచదార నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కీర్తి, వైభవానికి లోటు ఉండదు.
కుంకుమ పువ్వు: శివలింగంపై కుంకుమ సమర్పించడం వల్ల శివుని ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం ఎర్రని కుంకుమతో శివునికి తిలకం పూయడం వల్ల జీవితంలో మృదుత్వం వస్తుంది. మంగళ దోషం తొలగిపోతుంది.
పెర్ఫ్యూమ్: శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మత విశ్వాసాల ప్రకారం శివలింగంపై పరిమళాన్ని సమర్పించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. చెడు ధోరణుల నుండి విముక్తి లభిస్తుంది.