Rudrabhishekam: మీ రాశి ప్రకారం మహా శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేయండి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి-these things to use rudrabhishekam as per your zodiac signs on maha shivaratri 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rudrabhishekam: మీ రాశి ప్రకారం మహా శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేయండి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి

Rudrabhishekam: మీ రాశి ప్రకారం మహా శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేయండి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి

Gunti Soundarya HT Telugu
Mar 05, 2024 01:55 PM IST

Rudrabhishekam: మహా శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు. మీ రాశి ప్రకారం మహా శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

ఏ రాశి జాతకులు శివలింగానికి ఎలా అభిషేకం చేయాలి?
ఏ రాశి జాతకులు శివలింగానికి ఎలా అభిషేకం చేయాలి? (Pinterest )

Rudrabhishekam: మహా శివరాత్రి మరి కొన్ని రోజుల్లో రాబోతుంది. మాఘ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది.

ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ది యోగం, శివయోగం, సిద్ధ యోగం వంటి పవిత్రమైన యోగాలతో మహాశివరాత్రి జరుపుకోబోతున్నారు. పురాణాలలో మహా శివరాత్రిని శివపార్వతుల వివాహ దినోత్సవంగా జరుపుతారు.

ఏ రాశి జాతకులు ఎలా అభిషేకం చేయాలి?

శాస్త్రాల ప్రకారం మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితాలు లభిస్తాయి. ఈరోజు సకల గ్రహాలు అన్ని రాశుల ఇళ్లల్లో ఉండటం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుంది.

మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. శివ పంచాక్షరీ పారాయణం, శివ సహస్రనామ పారాయణం, మహా మృత్యుంజయ పారాయణ చేయడం ఎంతో శుభదాయకం. మీ రాశి చక్రం ప్రకారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి.

మేష రాశి

మహాశివరాత్రి రోజు మేష రాశి జాతకులు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తేనె, పంచదార, బెల్లం, గంగా జలంలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడం కోసం పాలు, పెరుగు, నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి.

మిథున రాశి

ఈ రాశి వాళ్ళు శివలింగానికి చెరుకు రసం, బిల్వపత్రాలు, ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి. శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో జన్మించిన వారు శుభం పొందడం కోసం పాలలో పంచదార కలిపి శివుడిని అభిషేకించాలి. తెల్లని వస్త్రాలు సమర్పించాలి.

సింహ రాశి

సింహ రాశి జాతకులు సంతోషం, శ్రేయస్సు కోసం మహాశివరాత్రి రోజున శివలింగానికి ఎర్రచందనం, తేనె, బెల్లంతో అభిషేకం చేయాలి.

కన్యా రాశి

మహా శివరాత్రి రోజున దుర్వా గడ్డి, తేనె, నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే బిల్వ పత్రాలు శివలింగం మీద ఉంచాలి.

తులా రాశి

ఈ రాశి జాతకులు చెరుకు రసం, నెయ్యితో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార, తేనె కలిపి చేయాలి. అలాగే ఎర్రని పూలు సమర్పించాలి. గంగాజలంతో అభిషేకించడం వల్ల శివుడు పులకించిపోతాడు. శుభ ఫలితాలను ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు పాలతో అభిషేకం చేయాలి. శివలింగానికి గంధం పూయాలి. పసుపు పువ్వులు సమర్పించాలి.

మకర రాశి

మకర రాశి జాతకులు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, బిల్వ పత్రాలు సమర్పించాలి. ఆకులపై గంధాన్ని రాశి అభిషేకం సమయంలో శివుడికి సమర్పించాలి.

కుంభ రాశి

కుంభ రాశి జాతకులు మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకించాలి. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది

మీన రాశి

మీన రాశి వాళ్ళు తేనె, గంగాజలంతో శివుని అభిషేకించాలి.