Datura flower: శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే ఏ ఫలితం దక్కుతుంది
Datura flower: శివుడిని రెండు విధాలుగా పూజిస్తారు. ఒకటి పుష్పాలతో, రెండోది ఆయనకి ఎంతోఇష్టమైన అభిషేకం. ఏయే పూలతో శివుడిని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసా?
Datura flower: పుష్పాలతో పూజ చేస్తే దేవుళ్ళు సంతోషిస్తారు. అందుకే పూజ చేసే సమయంలో దేవుడికి ఇష్టమైన పూలతో పూజ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు. అలాగే శివయ్యకి ప్రీతికరమైన పూలు ఉమ్మెత్త.
ఈ పూలతో పూజ చేస్తే శివుడు మెచ్చి కోరికలు తీరుస్తాడని నమ్మకం. వామన పురాణం ప్రకారం శివుని ఛాతీ నుంచి ఉమ్మెత్త పువ్వు ఉద్భవించింది. అందుకే భోళాశంకరుడిని పూజించెందుకు ఉమ్మెత్త పూలు ఎక్కువగా వినియోగిస్తారు.
ఉమ్మెత్త పూలతో పూజిస్తే ఏమవుతుంది?
మహాశివరాత్రి ఉమ్మెత్త పూలు, ఆకులు పరమేశ్వరుడికి సమర్పిస్తారు. మేథో మథనం సమయంలో శివుడు విషాన్ని తాగాడు. ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వల్ల శివునిలోని విష ప్రభావం శాంతించబడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వుతో ఆ పరమశివుడిని వేడుకుంటారు. ఉమ్మెత్త పూలతో చేసిన మాల శివుడికి అర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
దుర్గాదేవిని కూడా ఉమ్మెత్త పూలతో పూజిస్తారు. నవరాత్రి రోజుల్లో సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు ఉన్నప్పుడు ఉమ్మెత్త పూలతో పూజించాలి. అలా చేస్తే కోరికలన్నీ తీరతాయి. కుజ దోషం ఉన్న వాళ్ళు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే దోషం తొలగిపోతుంది. ఈ పూలతో పూజ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.
ఇది మాత్రమే కాదు మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఇలా చేస్తే దోషాలు పోయి సకల సంపదలు సిద్ధిస్తాయి. తెలుపు రంగు పూలు శివుడు ప్రత్యేకంగా ఇష్టపడతాడు. ఉమ్మెత్త పూలు మాత్రమే కాదు వీటితో పూజ చేసిన శివుని అనుగ్రహం పొందుతారు.
బిల్వ పత్రాలు
బిల్వ పత్రాన్ని సమర్పించకుండా చేసే శివ పూజ ఫలించదని అంటారు. పూజ చేసేటప్పుడు మూడు బిల్వ పత్రాలు తప్పనిసరిగా పెట్టాలి. బిల్వ వృక్షాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించాడని నమ్ముతారు. బిల్వ పత్రం పూజ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా నీటితో కడిగి మళ్ళీ పూజకి ఉపయోగించుకోవచ్చు.
మందార పువ్వు
తెలుపు రంగు పూలు మాత్రమే కాకుండా ఎరుపు రంగు పూలుతోను శివుడిని ఆరాధించవచ్చు. మందరపూలతో చేసిన మాలతో పూజించడం వల్ల శివుని అనుగ్రహంతో పాటు కైలాసంలో నివసించే అవకాశం లభిస్తుంది.
తామర పువ్వు
సంపద ఇవ్వమని కోరుకుంటూ కమలం పువ్వుని శివునికి సమర్పిస్తారు. తెలుపు, గులాబీ, నీలం రంగులో ఇవి లభిస్తాయి. నీలం రంగు కమలం శివునికి సమర్పించే వాటిలో ఉత్తమమైన పువ్వు. ఇది చాలా అరుదైనది. ఒక తామర పువ్వు వెయ్యి మారేడు దళాలతో సమానం.
మల్లెపూలు
పరమశివునికి అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లెపూలు సమర్పించి పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ పూలు శివునికి చాలా ప్రియమైనవి. వీటిని సమర్పించడం వల్ల అందమైన భార్య లభిస్తుంది. ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరగాలంటే మల్లెపూలతో పూజ చేస్తే మంచిది.
జిల్లేడు పూలు
జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైన మరొక పువ్వు. ఈ పుష్పాలతో పూజించడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయి.
గన్నేరు పూలు
గన్నేరు పూలతో పూజించడం వల్ల అనేక వ్యాధులని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీర్ఘకాల రోగాలు, భయంకరమైన వ్యాధులు కలిగిన వారు ఈ పూలతో పూజ చేస్తే రోగాలు నయం అవుతాయి.