Maha Mrityunjay Mantram: మహా మృత్యుంజయ మంత్రం.. మరణ భయాన్ని పోగొట్టే ఈ మంత్రాన్ని ఏ సమయంలో పఠించాలి?-why mahamrityunjaya mantram is so powerful which time is correct to chanting this mantram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Mrityunjay Mantram: మహా మృత్యుంజయ మంత్రం.. మరణ భయాన్ని పోగొట్టే ఈ మంత్రాన్ని ఏ సమయంలో పఠించాలి?

Maha Mrityunjay Mantram: మహా మృత్యుంజయ మంత్రం.. మరణ భయాన్ని పోగొట్టే ఈ మంత్రాన్ని ఏ సమయంలో పఠించాలి?

Gunti Soundarya HT Telugu
Feb 08, 2024 01:31 PM IST

Maha mrityunjay mantram: మహా మృత్యుంజయ మంత్రం శివుడి ఆశీస్సులు పొందేందుకు, మరణ భయం నుంచి విముక్తి పొందేందుకు శక్తిమంతమైనది. హిందూ శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఈ మంత్రం ఒకటి.

మహా మృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు
మహా మృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు (pixabay)

Mahamrityunjay Mantram: హిందూ మతంలో గాయత్రీ మంత్రం మాదిరిగా అత్యంత శక్తివంతమైన మరొక మంత్రం మహా మృత్యుంజయ మంత్రం. చనిపోతామనే భయాన్ని తొలగించి, చిరంజీవిగా నిలిపే మంత్రం ఇది. శివుని అనుగ్రహం కోసం ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు.

సర్వాంతర్యామిని శివుడే. శక్తి, జ్ఞానం, దైవానుగ్రహానికి ప్రతిరూపం కూడా ఆయనే. సర్వశక్తిమంతుడు. నాశనం చేసే శక్తి శివుడికే ఉంటుంది. అకాల మరణం నుంచి మనల్ని బయట పడేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిరోజూ మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల శివుడికి దగ్గరగా ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భక్తుల విశ్వాసం. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన మంత్రం ఇది.

మహా మృత్యుంజయ మంత్రం

“ఓం త్రయంబకం యజామహే, 

సుగంధిం పుష్టివర్ధనం, 

ఉర్వారుకమివ బంధనన్, 

మృత్యోర్ ముక్షీయ మామృతాత్”.

ఓంకార శబ్దంతో మంత్రం ప్రారంభమవుతుంది. మృత్యువు నుంచి విముక్తి కలిగించమని కోరుకుంటూ ఈ మంత్రం జపిస్తారు. మృత్యు భయాన్ని దూరం చేయమని శివుడిని ఈ మంత్రం ద్వారా వేడుకుంటారు. 

మూడు కళ్ళతో ఉన్న నిన్ను మేము పూజిస్తాము. సమస్త ప్రాణులని రక్షించేది నీవే. మా జీవితానికి భక్తి పరిమళాన్ని ఇవ్వు. మృత్యు భయం నుంచి మమ్మల్ని దూరం చేయమని వేడుకుంటూ శివుడిని ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరూ భయపడేది మరణానికే. చిన్న ప్రమాదం వచ్చినా కూడా ఎక్కడ చనిపోతామో అనే భయంతో నిత్యం గడుపుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది.

మహా మృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైన శక్తి వస్తుందని నమ్ముతారు. ఈ మంత్రం శక్తి భక్తుడి అంతర్గత బలం భావాన్ని తెలియజేస్తుంది. ధైర్యం, విపత్తు, ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించే శక్తిని అందిస్తుంది. దైవిక శక్తిని ప్రేరేపిస్తుంది. ప్రతికూల, దుష్ట శక్తులు, ప్రమాదాలు, అనారోగ్యాల నుంచి రక్షణ కవచంగా ఈ మంత్రం మనల్ని కాపాడుతుంది. జననం, మరణం గురించి ఒక స్పష్టత వస్తుంది. అమితమైన భక్తితో స్పష్టంగా ఈ మంత్రాన్ని జపించినప్పుడు మరణానికి మీరు భయపడరు.

ఈ మంత్రమ మనసుని శుద్ది చేస్తుంది. అధ్యాత్మికంగా ఎదిగేందుకు మిమ్మల్ని దైవం వైపు తీసుకెళ్తుంది. ఈ మంత్రం ఉచ్చరించేటప్పుడు ఇందులోని అందులోని ప్రతి పద్యం గురించి అర్థం చేసుకోవాలి. మహా మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల శివుడికి దగ్గరగా ఉంటారు. 

ఈ మంత్రం ప్రతిధ్వని, శక్తులు మీకు దైవానికి మధ్య వారధిని సృష్టిస్తాయి. జీవితం గురించి ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే మరణం గురించి అంత తక్కువ భయం ఉంటుంది. అందులోని శక్తిని అర్థం చేసుకున్నప్పుడు మీలోని భయం తొలగిపోతుంది. నిర్భయంగా సంతోషంగా మరణాన్ని స్వీకరిస్తారు. దైవంలో మమేకం అవుతారు.

ఎప్పుడు పఠించాలి?

మహా మృత్యుంజయ మంత్రాన్ని అత్యంత చిత్త శుద్ధితో, భక్తితో, సరైన ఉచ్చారణతో జపించడం ముఖ్యం. బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రం పఠించడం ఉత్తమం. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ మంత్రం ఉచ్చరించడం వల్ల మనసు తేలికపడుతుంది. 

ఏకాగ్రతతో ఉండేందుకు ప్రశాంతమైన, నిర్మలమైన పరిసరాలు ఎంచుకోవాలి. రుద్రాక్ష మాలతో ఈ మంత్రం పఠిస్తూ జపం చేయడం వల్ల మీరు దైవానికి మరింత దగ్గరగా ఉంటారు. నిర్భయస్థులుగా మారతారు.