దైవారాధనలో రుద్రాక్ష, తులసి మాల ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. రుద్రాక్ష గురించి పూర్తి వివరాలు ఉపనిషత్తులు, రుద్రాక్ష మహిమస్తోత్రంలో తెలుసుకోవచ్చు. శివారాధనలో రుద్రాక్ష ధారణ, విభూతి, శివ పంచాక్షరి మంత్రం ముఖ్యమైనవి.
రుద్రాక్ష ఒక వృక్షం. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రవేత్తలు రుద్రాక్షలో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా తేల్చారు. శివపురాణం, బ్రహ్మపురాణం, దేవీ భాగవతంలో రుద్రాక్ష గురించి మనకు తెలుసు. శివపురాణం ప్రకారం, విభూతి, రుద్రాక్షలతో శివుడిని పూజించడం శ్రేష్టం.
రుద్ర అంటే శివ. అక్షి అంటే కళ్ళు. పౌరాణిక కథనం ప్రకారం శ్రీపురాసురుడిని చంపడానికి శివుడు ఆయుధాన్ని సృష్టిస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఈ కన్నీటి చుక్కలు భూమిపై పడడం వల్లనే రుద్రాక్షి వృక్షాలు పెరిగాయని నమ్ముతారు. రుద్రాక్ష శివుని చెమట నుండి సృష్టించబడిందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.
మొత్తం 14 రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఈ 14 రకాల రుద్రాక్షిలు ఒక్కొక్కటి ఒక్కో ఫలాన్ని ఇస్తాయి. జన్మ కుండలిని బట్టి వీటిలో నుంచి రుద్రక్షను ఎంచుకుని ధరిస్తారు. అనేక సమస్యలకు రుద్రాక్షలు పరిష్కారం చూపుతాయని చెబుతారు. కుటుంబంలో కలహాలు, విద్య, ఆరోగ్యం, ఆర్థికం.. ఇలా అనేక సమస్యలకు రుద్రాక్ష ధారణ పరిష్కారం అని విశ్వసిస్తారు.
టాపిక్