Gayatri Mantra in Telugu: గాయత్రీ మంత్రం ఎందుకంత శక్తివంతమైనది-why gayatri mantra is so powerful what is the meaning of gayatri mantra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gayatri Mantra In Telugu: గాయత్రీ మంత్రం ఎందుకంత శక్తివంతమైనది

Gayatri Mantra in Telugu: గాయత్రీ మంత్రం ఎందుకంత శక్తివంతమైనది

Gunti Soundarya HT Telugu
Feb 05, 2024 12:16 PM IST

Gayatri Mantra in Telugu: ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది గాయత్రీ మంత్రం. అసలు గాయత్రీ మంత్రానికి అంత విశిష్టత ఎందుకు వచ్చింది?

గాయత్రీ మంత్రం ఎందుకు శక్తివంతమైనది
గాయత్రీ మంత్రం ఎందుకు శక్తివంతమైనది (freepik)

Gayatri mantra Importance: వేదాలకి తల్లి గాయత్రీ దేవి. పాపాలను నాశనం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మంత్రం గాయత్రీ మంత్రం. దీని గురించి రుగ్వేదంలో ప్రస్తావించబడింది. ఏదైన పూజ, హవనం లేదా రోజు ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని పఠించడం మంచిది.

సద్గురు గాయత్రీ మంత్రం గురించి మాట్లాడుతూ ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. శ్రేయస్సు, ఆరోగ్యం, విజయం సిద్ధిస్తాయి. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలని స్తుతించినట్టే. మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఉంటుంది. త్రికరణ శుద్ధితో మంత్రం జపించాలి. అందులోని శక్తివంతమైన శబ్ధాలని సరిగ్గా ఉచ్చరించాలి. ఈ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 మంది దేవతా మూర్తులు అంతర్హితమై ఉన్నారని వేదాలు చెబుతున్నాయి.

రోజులో మూడు సార్లు ఈ మంత్రాన్ని జపించవచ్చు. సంధ్యా సమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే సమయంలో ఈ మంత్రాన్ని పఠించవచ్చు.

గాయత్రీ మంత్రం అంటే ఏంటి?

“ఓం భూర్భువస్సువః

తత్సవితుః వరేణియం

భర్గో దేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్”

శ్లోకం మొదట వచ్చే ఓం నాదంతో వాతావరణం సానుకూల ప్రకంపనలు, శక్తితో నిండిపోతుంది. ఓం జపించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రంలోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైనది. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక, దాయివిక శక్తి నా చుట్టూ వ్యాపింపజేయు. నాలో ఉన్న చీకటిని తొలగించి జ్ఞానంతో నింపమని గాయత్రీ మంత్రం అర్థం.

గాయత్రీ మంత్రం ఎందుకంత ప్రత్యేకమైనది?

గాయత్రీ మంత్రాన్ని పఠించే వ్యక్తికి మాత్రమే కాదు చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రేరేపిస్తుంది. ఇది మానవులకు మాత్రమే పరిమితం కాదు. విశ్వంలోని అందరికీ ఇది వర్తిస్తుంది. మంత్రాన్ని జపించే వారికి మెరుగైన ఏకాగ్రత లభిస్తుంది. జ్ఞానాన్ని నిలుపుకుంటారు. జ్ఞాన మార్గంలో విజయవంతంగా రాణిస్తారు.

దృష్టి కేంద్రీకృతం అవుతుంది

గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది. మన చుట్టూ శక్తిని ప్రసారం చేస్తుంది. ఓం అనే శబ్ధం పలకడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలోచనలు అదుపులో ఉంటాయి. మీ దృష్టి, శ్రద్ధ మెరుగుపడుతుంది. మంత్రం జపించడం వల్ల మనసు నిర్మలంగా మారి దృషి దేవుడి మీదకి వెళ్తుంది. మనసులో ఆధ్యాత్మిక భావన ప్రేరేపితం అవుతుంది. భక్తి మరింత పెరుగుతుంది. తెలివితేటలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం స్థాయిలు పెరుగుతాయి.

మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సహకరిస్తుంది. మనసు మీ అధీనంలోకి వస్తుంది. చీకటిని దూరం చేసి వెలుగులోకి మిమ్మల్ని తీసుకెళ్ళేలా చేస్తుంది. మనసులో ఉన్న చెడు ఆలోచనలు వదులుకునే శక్తి మీకు లభిస్తుంది. మీలో ఉన్న చెడు ఆహారపు అలవాట్లు తొలగిపోతాయి. మనసులోని మలినాలు కడిగేసుకునేందుకు ఎక్కువ సార్లు గాయత్రీ మంత్రం జపించాలి.

రక్షణ, అంతః శుద్దీకరణ

ఖాళీ మనసు దెయ్యానికి నిలయం అంటారు. చెడు ఆలోచనలు కలిగిస్తుంది. దీని నుంచి బయట పడేందుకు గాయత్రీ మంత్రం పఠించాలి. మీలో వచ్చే నెగటివ్ ఆలోచనలు మాత్రమే కాదు ప్రతికూల శక్తుల నుంచి రక్షించే శక్తిని ఇస్తుంది. చీకటి నుంచి రక్షణ కోసం అవసరమైన బలం ఇవ్వమని దేవతలని కోరుకుంటారు. క్రమం తప్పకుండా జపించడం వల్ల చెడు ప్రభావాలకు వ్యతిరేకంగా మీ చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది.

ఈ నియమాలు తప్పనిసరి

గాయత్రీ మంత్రం ఎప్పుడంటే అప్పుడు జపించకూడదు. రోజులో మూడు సార్లు పఠించాలి. చెడు నుంచి రక్షిస్తూ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. తప్పని సరిగా సరైన పద్ధతిలో పఠించాలి. సరైన జ్ఞానం లేకుండా మార్గదర్శకులు లేకపోతే ఈ మంత్రం జపించకుండా ఉండటమే మంచిది. జపం సమయంలో తప్పుగా ఉచ్చరించడం చేయకూడదు.

మంత్రాలు శక్తిని కలిగి ఉంటాయి. వాటి శక్తిని అర్థం చేసుకోకుండా సగం జ్ఞానంతో జపిస్తే దేవతలని అవమానించినట్టే. వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గాయత్రీ మంత్రం పఠించాలని అనుకుంటే గురువు దగ్గర శిక్షణ తీసుకుని పూర్తి అర్థం తెలుసుకుని సరిగ్గా ఉచ్చరిస్తూ పదాలు పలకాలి.

Whats_app_banner