Shani pradosha vratam: అద్భుతమైన శుభ యోగాలతో శని ప్రదోష వ్రతం.. ఇలా చేశారంటే సకల కష్టాలు తొలగిపోతాయి-shani pradosha vratam date and time easy remedies to get relief shani sade sati dayya effect ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Pradosha Vratam: అద్భుతమైన శుభ యోగాలతో శని ప్రదోష వ్రతం.. ఇలా చేశారంటే సకల కష్టాలు తొలగిపోతాయి

Shani pradosha vratam: అద్భుతమైన శుభ యోగాలతో శని ప్రదోష వ్రతం.. ఇలా చేశారంటే సకల కష్టాలు తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu
Apr 05, 2024 12:10 PM IST

Shani pradosha vratam: శని త్రయోదశి, శని ప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వచ్చాయి. ఆరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు.

శని ప్రదోష వ్రతం
శని ప్రదోష వ్రతం (pixabay)

Shani pradosha vratam: హిందూమతంలో ప్రదోష వ్రతాన్ని నెలకు రెండు సార్లు జరుపుకుంటారు. ఏప్రిల్ నెలలో మొదటి ప్రదోష వ్రతం శనివారం ఏప్రిల్ 6వ తేదీన వచ్చింది. ఆరోజు త్రయోదశి తిథి కూడా ఉండడంతో శని త్రయోదశి జరుపుకుంటారు. శనివారం ప్రదోష వ్రతం రావడం వల్ల దీన్ని శని ప్రదోష వ్రతం గా పిలుస్తారు.

శని ప్రదోషం రోజున శివుడుతో పాటు శని దేవుడిని పూజించడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఈరోజు చేసే కొన్ని పనుల వల్ల పరమేశ్వరుడు తన భక్తుల అన్ని కోరికలను నెరవేరుస్తాడు. వారికి సంతోషం, అదృష్టాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల శని మహాదశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సహా సకల బాధలు తొలగిపోతాయి.

శని ప్రదోషం రోజు శుభ యోగాలు

శని ప్రదోషం రోజున శుభ, శుక్ల యోగాల కలయిక కూడా ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో బుధ, గురు గ్రహాలు మేషంలో ఉంటాయి. అటు శుక్రుడు, సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నారు. కుంభ రాశిలో శని కుజ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. వీటి ఫలితంగా శుభ, శుక్ల యోగాలు ఏర్పడతాయి. ఈ రెండు శుభయోగాల ప్రభావంతో శని ప్రదోష వ్రతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. శని ప్రదోష వ్రతం రోజు ఉపవాసం ఉండటం వల్ల దీర్ఘాయుష్షుతోపాటు, సుఖసంతోషాలు లభిస్తాయి.

శని ప్రదోష వ్రతం సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 6 ప్రదోష వ్రతం వచ్చింది. ఈ సమయంలో శివారాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రదోష వ్రతం సాయంకాలం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. ప్రదోష కాల పూజ శుభ సమయం సాయంత్రం 6:42 గంటల నుండి 8.48 వరకు ఉంటుంది. త్రయోదశి తిథి కూడా ఏప్రిల్ 6వ తేదీ వచ్చింది. దీని వల్ల ఆ రోజు శని త్రయోదశి కూడా జరుపుకుంటారు. ఈరోజు శనీశ్వరుడికి ఇష్టమైన పనులు చేయడం వల్ల శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శని అనుగ్రహం పొందుతారు.

శని ప్రదోష వ్రతం రోజు ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు శని మహాదశ. ఏలినాటి శని చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శివలింగానికి జలాభిషేకం చేయాలి

శని ప్రదోష వ్రతం రోజున శివలింగానికి మీరు నల్ల నువ్వులు, శమీ ఆకులు సమర్పించండి. దీని తర్వాత శివ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శివుని ఆశీస్సులు ఉంటే శనీశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే.

ఆవ నూనె దానం చేయాలి

శని ప్రదోషం, శని త్రయోదశి రోజున ఒక గిన్నెలో ఆవనూనె తీసుకుని అందులో మీ నీడను చూసుకోవాలి. తర్వాత శని ఆలయంలో ఆవ నూనె దానం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు విరాళాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

శివలింగంపై బిల్వపత్రాలు పెట్టండి

శని ప్రదోషం రోజున శివలింగానికి 108 బిల్వపత్రాలు సమర్పించండి. ఈరోజున శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులు నల్ల మినప్పప్పు, నల్ల బూట్లు, దుస్తులను దానం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు.

గుర్రపు షూ పెట్టుకోండి

వాస్తు ప్రకారం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం శని ప్రదోషం రోజున ప్రధాన ద్వారం వద్ద నలుపు రంగు గుర్రపు షూ వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు జీవితంలోని ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు.

శివలింగానికి ఇవి సమర్పించండి

శని ప్రదోష వ్రతం రోజు శివుని అనుగ్రహం పొందడం కోసం పూజ సమయంలో శివలింగానికి ఈ వస్తువులు సమర్పించండి. నెయ్యి, పెరుగు, పువ్వులు, పండ్లు, బిల్వ పత్రాలు, తేనే, భంగ్, గంగాజలం, తెల్లచందనం, నల్ల నువ్వులు, పచ్చిపాలు, పచ్చి పెసరపప్పు, శమీ ఆకులు, అక్షింతలు సమర్పించడం వల్ల శివుని ఆశీస్సులు పొందుతారు.

ఉపవాసం ఉండాలి

శని త్రయోదశి రోజు శనిదేవుడికి నల్ల నువ్వులు నీలం రంగు వస్త్రాలు సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు శని సడే సతి, దయ్యా ప్రభావాలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే శని ప్రదోష వ్రతం రోజు ఉపవాసం పాటించండి. ఇలా చేయడం వల్ల వీటి ప్రభావం తగ్గుతుంది.

హనుమంతుడిని పూజించాలి

శని త్రయోదశి రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. శనీశ్వరుడు హనుమంతుడి భక్తులకు సహాయం చేస్తాడు. వారికి తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. అలాగే త్రయోదశి రోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడి ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు.

WhatsApp channel