Holi Lucky zodiac signs: హోలీ రోజు నాలుగు శుభ యోగాలు.. ఈ రాశుల జీవితం కలర్ ఫుల్ గా మారబోతుంది-four auspicious yogas formed in holi these zodiac signs life gets colorful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi Lucky Zodiac Signs: హోలీ రోజు నాలుగు శుభ యోగాలు.. ఈ రాశుల జీవితం కలర్ ఫుల్ గా మారబోతుంది

Holi Lucky zodiac signs: హోలీ రోజు నాలుగు శుభ యోగాలు.. ఈ రాశుల జీవితం కలర్ ఫుల్ గా మారబోతుంది

Gunti Soundarya HT Telugu
Mar 22, 2024 05:37 PM IST

Holi Lucky zodiac signs: హోలీ రోజు నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం వల్ల నాలుగు రాశుల వారికి హోలీ నుంచి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఏయే రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూద్దాం.

హోలీ రోజు నాలుగు శుభ యోగాలు
హోలీ రోజు నాలుగు శుభ యోగాలు (pixabay)

Holi Lucky zodiac signs: ఏడాది హోలీ అనేక శుభయోగాలతో ప్రత్యేకంగా మారనుంది. మార్చి 25న వృద్ధి యోగం, శష యోగం, బుధాదిత్య రాజయోగం, ధనశక్తి యోగంతో పాటు గ్రహణయోగం కూడా ఏర్పడుతుంది. అన్ని యోగాల కలయిక వల్ల అనేక రాశుల జాతకుల జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. వీటి ప్రభావంతో కొన్ని రాశుల వారికి హోలీ అత్యంత శుభప్రదం కాబోతుంది.

మీన రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. 30 సంవత్సరాల తర్వాత శని కుంభ రాశిలో ఉండటం వల్ల శష రాజయోగం ఏర్పడుతుంది. దీనితో పాటు సంపదని ఇచ్చే శుక్రుడు, కుజుడు కుంభ రాశిలో సంయోగం చెందారు. దీని వల్ల ధన శక్తి యోగం వచ్చింది. ఇవన్నీ కలిసి హోలీని మరింత ప్రత్యేకంగా మార్చాయి. వీటితో పాటు గ్రహణ యోగం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణయోగం అశుభంగా పరిగణిస్తారు. దీని వల్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఈ గ్రహణ యోగం ప్రభావంతో నాలుగు రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇవన్నీ కలిసి రావడంతో ఈ రాశుల వాళ్ళు కలర్ ఫుల్ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి గ్రహణ యోగం అదృష్టాన్ని పెంచుతుంది. కెరీర్లో సానుకూల మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పూర్వీకుల సంపదను వారసత్వంగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది.

సింహ రాశి

గ్రహణ యోగం ప్రభావంతో హోలీ తర్వాత నుంచి సింహ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. తెలివిగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఫలవంతమైన రాబడిని పొందుతారు. హోలీ రోజున ఏర్పడే గ్రహణ యోగం ఈ రాశి వారికి డబ్బు సంపాదించే అవకాశాలను తీసుకొస్తుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో రాణిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. మీ పనులకు ప్రశంసలు దక్కుతాయి. భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి గ్రహణ యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఫలితంగా ఈ రాశి జాతకులు తమ ఆర్థిక స్థితిలో గణనీయమైన అభివృద్ధిని చూస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి నుంచి అంతులేని ప్రేమ పొందుతారు. ఆనందంగా జీవిస్తారు. లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారంలో మీరు చేసుకునే ఒప్పందాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఈ గ్రహణ యోగం కుంభ రాశి వారిని విజయం వైపు నడిపిస్తుంది.

మీన రాశి

మీన రాశి వారికి గ్రహణ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా బలపడతారు. మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతృప్తికరమైన జీవితం సాగిస్తారు. ఈ గ్రహణ యోగం సంపద, శ్రేయస్సును, ఆనందాన్ని, సమృద్ధిని ఇస్తుంది.

Whats_app_banner