Grahana yogam: మూడు రోజుల్లో గ్రహణ యోగం.. ఈ రాశుల జాతకులకు కష్టాలు అధికం కాబోతున్నాయి
Grahana yogam: మరో మూడు రోజుల్లో సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాడు. కుంభం నుంచి మీన రాశిలో ప్రవేశించడం వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి కష్టాలు అధికం కాబోతున్నాయి.
Grahana yogam: గ్రహాల రాజు సూర్యుడు ప్రస్తుతం శని రాశి చక్రం కుంభంలో సంచరిస్తున్నాడు. మరో మూడు రోజుల్లో దేవగురువు బృహస్పతికి చెందిన మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు. 2024 ఏప్రిల్ 13 వరకు సూర్యుడు మీన రాశిలోనే సంచరిస్తాడు. జ్ఞానం, తెలివితేటలు, విచక్షణ వంటి వాటికి సూర్యుడు కారకుడు భావిస్తారు. సూర్యుడు మీన రాశిలో ప్రవేశించిన వెంటనే ఖర్మలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వివాహం వంటి శుభకార్యాలు నిర్వహించడానికి శుభ సమయం కాదు.
సూర్య భగవానుడు బృహస్పతి రాశులైన ధనుస్సు, మీన రాశిలో సంచరించినప్పుడు ఖర్మలు ఏర్పడతాయి. ఈ సమయం ఆరాధన, యజ్ఞం, హవనం, జపం, తపస్సు, పూజలు వంటికి వాటికి అనుకూలంగా ఉంటుంది. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు శుభకరమైన సమయం కాదు. మీన రాశిలో సూర్యుడు ప్రవేశించడంతో అప్పటికే అక్కడ సంచరిస్తున్న రాహువుతో కలయిక జరుగుతుంది. దీని ఫలితంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహణ యోగం విస్తృత ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అశుభంగా పరిగణిస్తారు. సూర్యుడు రాహువు కలయిక వల్ల ఏర్పడిన గ్రహణ యోగం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే..
మేష రాశి
గ్రహణ యోగం ప్రభావంతో మేషరాశి జాతకులు చేపట్టే పనులలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ వనరులు మెరుగుపడతాయి. చదువు, బోధనకు సంబంధించి ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. సంతాన విషయంలో కాస్త ఆందోళన చెందుతారు. కంటి నొప్పి వల్ల ఒత్తిడి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభ రాశి
గ్రహణ యోగంతో వృషభ రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. స్థిరాస్తి, వాహనానికి సంబంధించి కొద్దిగా టెన్షన్ ఉంటుంది. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆందోళన చెందుతారు.
మిథున రాశి
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వనరులలో సానుకూల ప్రగతి ఉంటుంది. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటకం
పనిలో అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది. సోదరులు, స్నేహితులు విషయంలో టెన్షన్ వాతావరణ నెలకొంటుంది. మాటల్లో తీవ్రత పెరుగుతుంది. రోజు వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పొట్ట, పాదాల సమస్యలు వల్ల ఒత్తిడికి గురవుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో గందరగోళ వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి
గ్రహణ యోగంతో సింహ రాశి జాతకులు రోజువారి ఆదాయం పెరుగుతుంది. కడుపు, మూత్ర విసర్జన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి జాతకుల జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సవాళ్లు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
తులా రాశి
సూర్యుడు, రాహువు కలయిక కారణంగా తులా రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. సంబంధాల్లో విభేదాలు పెరుగుతాయి. మనసులో అలజడి ఏర్పడుతుంది. న్యాయపరమైన విషయాలలో ఇబ్బందులు అధికమవుతాయి. శత్రువులు చురుగ్గా ఉంటారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ధన నష్టం సంభవిస్తుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలలో ఇబ్బందులు పెరుగుతాయి. మీ పరువుకు భంగం కలగవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్ళతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది.