Shami plant: శమీ మొక్క మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?-here is the reason behind to have the plant shami at your home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shami Plant: శమీ మొక్క మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?

Shami plant: శమీ మొక్క మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Feb 01, 2024 07:00 PM IST

shami plant: శని దేవుడి అనుగ్రహం కోసం శమీ మొక్క ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అది మాత్రమే కాదు శమీ మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

శమీ మొక్క
శమీ మొక్క (lilplants)

shami plant: హిందువులు శమీ వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శని దేవుడి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు హిందూ సంస్కృతిలో శమీ చెట్టుకి తప్పనిసరిగా పూజలు చేస్తారు. ఇంట్లో శమీ మొక్క పెంచుకుని జాగ్రత్తగా చూసుకుంటూ దీపం వెలిగిస్తే శని దేవుడి చల్లని చూపు ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శమీ చెట్టు ప్రాముఖ్యత ఈ కాలంలో మొదలైంది కాదు.

మత గ్రంథాల ప్రకారం రామాయణం, మహా భారతం రెండింటిలోనూ శమీ చెట్టు గురించి ప్రస్తావించారు. రామాయణంలో రాముడు లంక మీద యుద్దానికి వెళ్ళే ముందు శమీ మొక్కకి పూజ చేసి వెళ్లాడని చెప్తారు. అలాగే మహా భారతంలో అర్జునుడు తన గాండీవ విల్లుని దాని కొమ్మలలో దాచాడు. పాండవులు అరణ్య వాసం పూర్తి చేసిన తర్వాత శమీ చెట్టుకి పూజ చేసి కురుక్షేత్ర యుద్ధం చేసి విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి.

శమీ వృక్షం ఇంట్లో ఎందుకు ఉండాలి?

భారతీయ ఇతిహాసాల ప్రకారం రాముడు, అర్జునుడు శమీ చెట్టును పూజించి ఆశీర్వాదాలు పొందారు. అందుకే శమీ వృక్షం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది మీ ఇంట్లో ఉండటం వల్ల శని అనుగ్రహం మీ మీద ఉంటుంది. పూజ, యజ్ఞం లేదా హవనాల సమయంలో దేవతలకి శమీ ఆకులని సమర్పించడం వల్ల పర్యావరణాన్ని శుద్ది చేయడంతో పాటు దేవతల ఆశీస్సులు పొందుతారు.

గాలిని శుద్ది చేస్తుంది

శమీ వృక్షం గాలిని శుద్ధి చేస్తుంది. ఇతర మొక్కల మాదిరిగానే ఇది హానికరమైన కాలుష్య కారకాలని గ్రహించి ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. గాలి నాణ్యతని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్వచ్చమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు ఇస్తుంది.

ప్రశాంతతని ఇస్తుంది

ఇంటి చుట్టూ పచ్చని మొక్కలు ఉంటే అందంగా ఉంటుంది. శమీ మొక్క ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసుకో ఓదార్పునిస్తుంది. దాని ఆకుపచ్చ ఆకులు, గులాబీ, పసుపు రంగు పూలు చూస్తే విశ్రాంతి భావన కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే రిలాక్స్ గా అనిపిస్తుంది.

ఆయుర్వేదంలో కీలకం

భారతీయ సంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదంలోనూ శమీ మొక్క ఆకులు, బెరడు వంటి వివిధ భాగాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. శమీ ఆకుల నుంచి వచ్చే పేస్ట్ ని చికిత్స కోసం వినియోగిస్తారు. ముఖానికి రాసుకుతె దద్దుర్లు వల్ల వచ్చే చికాకు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. చెట్టు బెరడు నుంచి తయారు చేసే పొడిని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలకి సంబంధించి వ్యాధులకి చికిత్స చేయడంలో శమీ చెట్టును ఉపయోగిస్తారు.

శని దేవుడితో సంబంధం

వైదిక జ్యోతిష్య శాస్త్రం శని గ్రహంతో శమీ చెట్టుకు సంబంధం కలిగి ఉంటుంది. శని దేవుడి దుష్ప్రభావాల వల్ల వ్యక్తి జీవితంలో అనేక బాధలు వస్తాయి. కొన్ని సార్లు డబ్బు, ఆరోగ్యం, జీవితాన్ని కోల్పోయే అవకసం ఉంది. అందుకే శని దోషం నుంచి విముక్తి కలిగి ప్రతికూల ప్రభావాలని తగ్గించుకోవడం కోసం ఇంట్లో శమీ మొక్కని ఉంచడం మంచిది. శని చెడు ప్రభావాలని శమీ చెట్టు తగ్గించగలదు.

సంరక్షణ చాలా ముఖ్యం

శమీ మొక్క ఎదుగుదలకి చిహ్నం మాత్రమే కాదు పవిత్రమైనది కూడా. అందుకే శమీ మొక్క సంరక్షణ చాలా ముఖ్యం. మొక్కకి తగినంత సూర్యరశ్మి ఉండేలా చూడాలి. శమీ మొక్క చుట్టూ శుభ్రంగా ఉండాలి. శనివారం రోజు శమీ చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది.