Horseshoe vastu tips: గుర్రపు షూని ఈ దిశలో పెట్టారంటే శని ప్రభావం తగ్గుతుంది.. సంపద పెరుగుతుంది-which direction is best for hang horseshoe in house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horseshoe Vastu Tips: గుర్రపు షూని ఈ దిశలో పెట్టారంటే శని ప్రభావం తగ్గుతుంది.. సంపద పెరుగుతుంది

Horseshoe vastu tips: గుర్రపు షూని ఈ దిశలో పెట్టారంటే శని ప్రభావం తగ్గుతుంది.. సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
Dec 24, 2023 07:00 AM IST

Horseshoe vastu tips: కొత్త సంవత్సరం మీ ఇంట్లో సంపద పెరిగి శని అశుభ ప్రభావం తొలగిపోవాలంటే గుర్రపు షూని మీ ఇంట్లోకి తీసుకురండి. ఏ దిశలో గుర్రపు డెక్క ఉంచాలో తెలుసా?

గుర్రం షూ ఏ దిశలో పెట్టాలి?
గుర్రం షూ ఏ దిశలో పెట్టాలి? (pixabay)

Horseshoe vastu tips: చాలా మంది ఇళ్లకి ప్రధాన ద్వారం వద్ద U ఆకారంలో ఉండే ఒక ఇనుప వస్తువు తగిలించి ఉండటం చూస్తూనే ఉంటారు. దాన్ని గుర్రపు షూ అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రపు షూ లేదా గుర్రపు డెక్క ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుంది. ఇంట్లో నల్ల గుర్రపు డెక్క ఉండే శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

గుర్రపు డెక్క వేలాడదీయడం వల్ల జీవితంలో అన్ని బాధలు, ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో గుర్రపు షూస్ పెట్టడం వల్ల ప్రశాంతత లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించి అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇంట్లో గుర్రపు షూని వేలాడదీసే వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో గుర్రపు షూని వేలాడదీయడం చాలా పవిత్రంగా భావిస్తారు.

గుర్రపు షూని ఏ దిశలో ఉంచాలి?

వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నల్ల గుర్రపు షూని ఉంచడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఉత్తరం లేదా తూర్పు దిశలో గుర్రపు డెక్క ఉంచకూడదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని అనుకుంటే గుర్రం కుడి పాదం షూని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయవచ్చు. డబ్బుకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శని అశుభ ప్రభావాల నుంచి బయట పడాలంటే ఆవ నూనె గిన్నెలో నల్ల గుర్రపు షూని ఉంచి శమీ చెట్టు కింద పూడ్చాలి. ఇలా చేయడం వల్ల శనిదోషం నుంచి విముక్తి లాభిస్తనది. యు ఆకారంలో ఉండే గుర్రపు షూని ఇంట్లో, ఆఫీసులో పెట్టుకోవడం శుభప్రదం. రెండు ఆకరాల్లో ఇది లభిస్తుంది. రివర్స్ యు ఆకారం కూడా పెట్టుకోవచ్చు. రివర్స్ యు ఆకారం మీదగ్గర ఉండే దాని మీద ఖచ్చితంగా అద్దం ఉంచాలి.

గుర్రం షూ ఇంట్లో తగిలించే ముందు దాన్ని గంగాజలం లేదా నది నీటిలో శుభ్రపరచాలి. సూర్యకిరణాలు దీని మీద పడితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇనుముతో చేసిన గుర్రపు డెక్క పెడితే మంచిది. ఇది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. గుర్రపు డెక్క చివర్లు పైకి ఉండేలా అమర్చడం వల్ల ఆ ఇంటికి అదృష్టం, సంపద కలుగుతాయి. ఇది ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీమీద ఉంటుంది.

గుర్రపు డెక్క పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు

ఆఫీసులో నల్లని గుర్రం షూ పెట్టడం వల్ల ధన ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. నల్లని హార్స్ షూ పెట్టుకుంటే నెగిటివిటీ తొలగిపోతుంది. ఇంటికి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. సంపద, సౌభాగ్యం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

గుర్రపు డెక్క ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లోకి ఆధ్యాత్మిక శక్తిని ఆకర్షిస్తుంది. తలుపు దగ్గర వేలాడదీస్తే చెడు కన్ను దృష్టి తొలగిపోతుంది. పీడకళ్ళు దూరం చూసేందుకు ఈ గుర్రపు షూ గుర్తు మంచం దగ్గర కూడా పెట్టుకోవచ్చు.

Whats_app_banner