Home vastu tips: కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వెంటాడుతున్నాయా? వాస్తు దోషాలు ఇలా తొలగించేయండి-are you facing problems after entering new home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Home Vastu Tips: కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వెంటాడుతున్నాయా? వాస్తు దోషాలు ఇలా తొలగించేయండి

Home vastu tips: కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వెంటాడుతున్నాయా? వాస్తు దోషాలు ఇలా తొలగించేయండి

Gunti Soundarya HT Telugu
Dec 13, 2023 04:00 PM IST

home vastu tips: ఎంతో సంతోషంగా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ అశుభాలే జరుగుతున్నాయా? ఈ దోష నివారణలు పాటించి చూడండి.

కొత్త ఇంట్లో సమస్యలా?
కొత్త ఇంట్లో సమస్యలా? (pexels)

Newhome vastu tips: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. స్వయంగా సంపాదించుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకుని అందులో సుఖ సంతోషాలతో జీవించాలని అనుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంతో సంతోషంగా అందులో నివసించేందుకు వెళతారు. కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరంగా చిక్కులు రావడం, ఉద్యోగంలో సమస్యలు, తగాదాలు వంటివి ఎదురవుతాయి. దీంతో ఇల్లు కలిసి రాలేదని ఏదో వాస్తు దోషం ఉందని అనుకుంటారు. ఈ వాస్తు లోపాలని నివారించేందుకు ఇలా చేసి చూడండి.

వాస్తు దోష నివారణలు

కుటుంబంలో ఎవరైనా కొత్త ఇంటికి వచ్చిన వెంటనే అనారోగ్యానికి గురైతే భోజనం చేసిన తర్వాత బెల్లం తినాలి. ఏ పని తలపెట్టినా పూర్తి కాకపోవడం, ఆటంకాలు ఏర్పడుతుంటే ఇంట్లో పసుపు రంగు కర్టెన్లు కట్టుకోవాలి. అలాగే ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు చల్లాలి. అలా చేయడం వల్ల నవగ్రహాల్లో అత్యంత పవిత్రమైన గ్రహం బృహస్పతి. ఆశీస్సులతో ఇల్లు, కుటుంబం అభివృద్ధి చెందుతుంది.

ఇంట్లోకి గాలి రాకుండా మూసేసినట్టుగా ఉన్న కూడా అది వాస్తు లోపం కిందకి వస్తుంది. దీన్ని నివారించడం కోసం తెల్ల బియ్యం, కర్పూరం వంటి తెల్లని పదార్థాలు దానం చేయాలి. ఉదయాన్నే సూర్యరశ్మి కిరణాలు ఇంట్లోకి పడితే చాలా మంచిది. అలా కాకుండా ఇల్లు చీకటిగా ఉంటే దురదృష్టం, దుఃఖం వెంటాడతాయి. దీన్ని నివారించేందుకు రాత్రిపూట ఇంటి చుట్టూ ఎర్ర పప్పు చల్లి ఉదయం లేచిన తర్వాత వాటిని బయటకి విసిరేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే…

కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు శ్వాస కోశ వ్యాధులు, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రతి సోమవారం మీ ఇష్టదైవానికి ఖీర్ సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. మీ బంధువులకు, ప్రియమైన వారికి పంచి పెట్టాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

పిల్లలు చదువుల్లో రాణించలేకపోతున్నారా? మీ మాట వినడం లేదా? ఇంటి ప్రధాన ద్వారం వద్ద రాగీతో చేసిన సూర్య యంత్రాన్ని పెట్టాలి. అలాగే పూజ గడిలోని సూర్య యంత్రాన్ని ప్రతిష్టించి పూజించాలి. ఇలా చేస్తే పిల్లల మీద దేవుడి అనుగ్రహం ఉంటుంది. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగం విషయంలో సమస్యలు ఎదురయితే ఆవనూనె దానం చేసి శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించాలి. ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం పొందుతారు.

సంతోషంగా ఉండాలంటే

కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య చికాకు వాతావరణం ఏర్పడుతుంది. సంతోషానికి, ప్రశాంతతకి ఆటంకం కలుగుతూ ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే స్వస్తిక్ గుర్తుని ఇంటి ప్రధాన ద్వారం పైన పెట్టాలి. అలాగే ప్రధాన ద్వారం వెలుపల గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఈశాన్య మూలలో రాగి పాత్రలో నీరు పోసి దానిపైన ఒక గిన్నె పెట్టి ఐదు ముత్యాలు ఉంచాలి. ఇలా చేస్తే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధ, తాబేలు బొమ్మ పెట్టుకుంటే మంచిది. శ్రేయస్సుని పొందుతారు.

WhatsApp channel

టాపిక్