Maha Shivaratri Puja : శివలింగానికి ఎన్ని బిల్వపత్రాలు సమర్పించాలి? ఎలా ఉపయోగించాలి?
Maha Shivaratri 2023 : మహాశివరాత్రితో శివయ్యను తలుచుకుంటున్నారు భక్తులు. పూజలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. గోగుపూలు, మారేడు, బిల్వ దళాలను సమర్పిస్తారు. అయితే ఇందులో బిల్వ పత్రం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాన్ని దేవ దేవుడికి సమర్పిస్తారు.
మహా శివరాత్రి(Maha Shivaratri) పండుగను భక్తులు జరుపుకొంటున్నారు. శివరాత్రి గురించి.. పలు కథలు ఉన్నాయి. శివుడు పార్వతీ దేవితో ఐక్యమయ్యాడు.. వివాహం చేసుకున్నారని చెబుతారు. వివాహం చేసుకున్నా.., లేదా వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులకు ఈ రోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే శివుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదం కోసం ప్రజలు ఉపవాసం పాటిస్తారు. పూజ సమయంలో పాలు(Milk), నీరు, పువ్వులు, బిల్వ పత్ర ఆకులతో సహా అనేక వాటిని శివయ్యకు సమర్పిస్తారు. శివలింగంపై నీరు, బిల్వ పత్రాలు స్వచ్ఛమైన హృదయంతో సమర్పించే భక్తుల కోరికలన్నింటినీ శివుడు నెరవేరుస్తాడని చెబుతారు.
శివరాత్రి(Shivaratri) పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివలింగానికి నీరు, బిల్వ పత్రాలు సమర్పించేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ దేవదేవుడిని వేడుకుంటారు. అయితే శివలింగానికి(shivling) బిల్వ పత్ర ఆకులు ఎందుకు పెడుతారో తెలుసా? శివుని పూజలో ఈ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుడికి చాలా ప్రియమైనది. అదే సమయంలో శివలింగంపై బిల్వ పత్రాలు అందించడానికి సరైన మార్గం ఉంది.
కొన్ని నమ్మకాల ప్రకారం.., శివలింగానికి 3 నుండి 11 బిల్వ పత్ర ఆకులను సమర్పించడం శుభప్రదం. అయితే మీరు దీని కంటే ఎక్కువ కూడా సమర్పించవచ్చు. మీ వద్ద ఒక్క బిల్వ పత్ర(Bilwa Patra) ఆకు అయినా ఉంటే, మీరు స్వచ్ఛమైన హృదయంతో పూజిస్తే శివుడు కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం. మరోవైపు వివాహం కోసం శివలింగానికి 108 బిల్వ పత్రాలను సమర్పించాలి.
శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకు యొక్క మృదువైన భాగం శివలింగంపై ఉండాలని గుర్తుంచుకోండి. కావాలంటే బిల్వ పత్రంపై గంధాన్ని కూడా పూయవచ్చు. మీ వద్ద ఎక్కువ ఆకులు లేకపోతే, మీరు సమర్పించిన ఆకులను ఒకసారి నీటితో కడిగి, మళ్లీ మళ్లీ సమర్పించవచ్చు. ముందుగా నీటిని అందించకుండా శివలింగంపై బిల్వపత్రాన్ని ఎప్పుడూ సమర్పించకూడదు. శివలింగానికి సమర్పించడానికి బిల్వ పత్ర ఆకును తీసుకువచ్చేప్పుడు.. ఆ ఆకు చిరిగిపోకూడదు. ఎక్కువ చారలు ఉండకూడదని గుర్తుంచుకోండి. చారలు ఉన్న బిల్వపత్ర ఆకును పూజలో ఉపయోగించకూడదు.
గమనిక : ఈ కథనం సాధారణ సమాచారం, సామెతల ఆధారంగా అందించాం.. HT Telugu దాని వాస్తవికతను నిర్ధారించలేదు.
సంబంధిత కథనం