Spiritual Bath: స్నానం చేసే నీటిలో ఈ 9 వస్తువులను కలిపారంటే- నవ గ్రహాల అనుగ్రహం పొందుతారు-if you mix these 9 things in the bath water you will get the blessings of all planets ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Spiritual Bath: స్నానం చేసే నీటిలో ఈ 9 వస్తువులను కలిపారంటే- నవ గ్రహాల అనుగ్రహం పొందుతారు

Spiritual Bath: స్నానం చేసే నీటిలో ఈ 9 వస్తువులను కలిపారంటే- నవ గ్రహాల అనుగ్రహం పొందుతారు

Ramya Sri Marka HT Telugu
Nov 20, 2024 05:18 PM IST

Spiritual Bath: స్నానం చేయడం వల్ల కూడా గ్రహాల అనుగ్రహం పొందొచ్చు. అంతర్లీనంగా పేరుకుపోయి ఉన్న చెడ్డ ఆలోచనలు, నెగెటివిటీని పారద్రోలి సానుకూల శక్తులను గ్రహించవచ్చు. చిన్నపాటి శ్రమతో బోలెడు లాభాలు పొందొచ్చు.

ఆధ్మాత్మిక స్నానం
ఆధ్మాత్మిక స్నానం

జ్యోతిష్య శాస్త్రం అంటే నక్షత్రాలు, గ్రహాలు మాత్రమే కాదు. నిష్టతో పాటించే సంప్రదాయాలు, ఆచారాలు కూడా.ప్రతి రోజూ మనం ఆచరించే కొన్ని పనులు కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపిస్తాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ గ్రహాల అనుగ్రహం మనపై ఉంటేనే జీవితంలో సంతోషం, శక్తి, ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి వంటి శుభఫలితాలు దక్కుతాయి. అవి లేనప్పుడు అంతటా అశాంతి, ఓటమి, ఒత్తిడి అప్పులు వంటివి బాధిస్తుంటాయి. గ్రహాల అనుగ్రహం కోసం రకరకాల పరిహారాలు, దోష నివారణలు పాటస్తుంటాం. అలాగే కొన్ని రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాం. అలాంటి వాటిలో ఒకటి స్నానం చేసే నీటిలో ప్రత్యేకమైన వస్తువులను కలుపుకోవడం.ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో 9 రకాల వస్తువులను కలుపుకోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహం పొందవచ్చు. ఆ వస్తువులేంటో తెలుసుకుందామా..

కళ్లుప్పు

ప్రపంచవ్యాప్తంగా దుష్టశక్తులను ప్రక్షాళన చేసేందుకు ముందుగా ఉపయోగించే సాధనం కళ్లుప్పు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కల్లుప్పును స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల ఆ నీటిలో నెగెటివ్ ఎనర్జీలు మాయమై స్వచ్ఛమవుతాయట. ప్రత్యేకించి ఈ నియమం కృష్ణ పక్షం రోజుల్లో పాటించడం వల్ల నీటిలో నెగెటివిటీ విడుదల కావడంలో సహాయపడుతుంది. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న వారు ఆ భావన నుంచి బయటపడి, మొత్తంగా కూడా నూతనోత్తేజితులవుతారు.

గులాబీ రేకులు

శుక్ర గ్రహ అనుగ్రహం పొందగలిగే గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది. ప్రత్యేకించి మనపై మనకు ప్రేమను పెంచి ప్రశాంతతతో పాటు ఉల్లాసవంతంగా చేస్తుంది. చాలా మంది నమ్మకం ప్రకారం, గులాబీ రేకులు హృదయ చక్ర తెరుచుకోవడానికి దోహదపడతాయి. వీటితో స్నానం చేయడం వల్ల మీ మూడ్‌ను మార్చి ఆందోళన నుంచి బయటకు తెస్తుంది.

పాలు, కొబ్బరి నీళ్లు

కొన్ని వందల సంవత్సరాల నుంచి పాలతో స్నానం చేయడం అనేది చాలా పాపులర్. వాటితో పాటు కొబ్బరి నీళ్ల స్నానం కూడా మంచిది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. పాలు, కొబ్బరి నీళ్లు అనేవి చంద్రుడితో లింక్ అయి ఉంటాయి. మన భావోద్వేగాలని, స్పృహలో లేని ఆలోచనలను ఆధీనంలో ఉంచుతాయి. వీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి, ఆలోచనలు ప్రశాంతంగా మారిపోతాయి. ఈ ప్రయోజనం పొందడానికి పాలతో స్నానమనేది ప్రత్యేకించి పౌర్ణమి రోజుల్లో చేయడం బెటర్.

తులసి ఆకులు

తులసి ఆకులు అనేవి రక్షణ కల్పించేదిగా మాత్రమే కాకుండా శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయి. తులసి మొక్క నేరుగా గురు గ్రహంతో లింక్ అయింది. దీని కారణంగా కెరీర్‌లో ఎదుగుదల, తెలివి తేటలు, ఆధ్మాత్మిక వృద్ధి మెరుగవుతాయి. తులసి ఆకులతో స్నానం చేయడం వల్ల పాజిటివిటీ, పర్సనల్ పవర్ మెరుగై ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. తద్వారా మానసిక ఆందోళనలు తగ్గి చెడు ఆలోచనలు దూరమవుతాయి.

లావెండర్, యాలకుల పొడి

బుధ గ్రహ అనుగ్రహం లావెండర్, యాలకుల పొడిపై స్పష్టంగా ఉంటుంది. ఈ గ్రహ స్వభావం కమ్యూనికేషన్‌తో పాటు తెలివితేటలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీటిని నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మానసిక రుగ్మతలు తగ్గి ఏకాగ్రత మెరుగై భావ వ్యక్తీకరణ సులభతరం అవుతుంది. ప్రశాంతంగా ఉంచే స్వభావం ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

తేనె

స్నానాల్లో తరచూ వాడుకోదగ్గ పదార్థం తేనె. స్నానపు నీటిలో కలుపుకోవడం వల్ల శుక్ర గ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు ప్రేమ వెల్లివిరుస్తుంది. తేనెతో స్నానం చేయడం వల్ల మరింత ఆకర్షణీయవంతంగా కనిపిస్తారు. చర్మానికి మెరుపు అందించడమే కాకుండా సహజమైన కాంతిని తీసుకొస్తుంది.

పసుపు

సూర్యానుగ్రహం ఉన్న పదార్థం పసుపు. దీనిని నీటిలో కలుపుకుని స్నానం చేయడం వల్ల మనలో ఇమిడి ఉన్న నెగెటివ్ ఎనర్జీని పారద్రోలి సానుకూల శక్తుల అనుగ్రహం కలిగేలా చేస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడానికి కూడా పసుపు స్నానం మంచిదని నిపుణులు చెబు తున్నారు. ఇది మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడంతో పాటు స్వీయ విశ్లేషణకు దోహదపడుతుంది.

ఆధ్మాత్మిక స్నానం ఎలా చేయాలి:

ఈ ప్రయోజనాలను పొందాలంటే, మిమ్మల్ని బాధిస్తున్న దోషాల నుంచి విముక్తి కోసం వేడి నీటిలో ఆయా వస్తువులను కలపాలి. అలా దాదాపు 20 నిమిషాల పాటు నానిన తర్వాత ఆ నీటితో స్నానం చేసే ముందు ఆ ప్రయోజనాలను గుర్తు చేసుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner