Brixton Cromwell 1200: ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్స్ భారత్ లో లాంచ్; 1222 సీసీ తో దుమ్ము రేపే పవర్-in pics brixton cromwell 1200 range launched in india check price features and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brixton Cromwell 1200: ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్స్ భారత్ లో లాంచ్; 1222 సీసీ తో దుమ్ము రేపే పవర్

Brixton Cromwell 1200: ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్స్ భారత్ లో లాంచ్; 1222 సీసీ తో దుమ్ము రేపే పవర్

Nov 20, 2024, 09:57 PM IST Sudarshan V
Nov 20, 2024, 09:57 PM , IST

  • బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్ అనేది ఆస్ట్రియా బ్రాండ్. ఇది నాలుగు మోడళ్లను విడుదల చేయడం ద్వారా అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. క్రోమ్వెల్ 1200 కాకుండా, భారతదేశంలో బ్రాండ్ పోర్ట్ఫోలియోలో క్రాస్ ఫైర్ 500 శ్రేణికి చెందిన మరో రెండు మోడళ్లు ఉన్నాయి.

ఆస్ట్రియాకు చెందిన బిక్స్ టన్ క్రోమ్ వెల్ లేటెస్ట్ గా రెండు మోడల్స్ బైక్స్ ను భారత్ లో లాంచ్ చేసింది. అవి బిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200, బిక్స్ టన్ క్రోమ్ వెల్1200 ఎక్స్.  వాటిలో  బిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200 ప్రారంభ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షో రూమ్). ఇవి మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో ఉత్పత్తి అవుతున్నాయి.

(1 / 10)

ఆస్ట్రియాకు చెందిన బిక్స్ టన్ క్రోమ్ వెల్ లేటెస్ట్ గా రెండు మోడల్స్ బైక్స్ ను భారత్ లో లాంచ్ చేసింది. అవి బిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200, బిక్స్ టన్ క్రోమ్ వెల్1200 ఎక్స్.  వాటిలో  బిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200 ప్రారంభ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షో రూమ్). ఇవి మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో ఉత్పత్తి అవుతున్నాయి.(Brixton )

క్రోమ్ వెల్ 1200 ను నియో రెట్రో రోడ్ స్టర్ గా భారత్ లోకి తీసుకువచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షో రూమ్). దీనికి ఎల్ ఈడీ రౌండ్ హెడ్ ల్యాంప్, 16 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటాయి.

(2 / 10)

క్రోమ్ వెల్ 1200 ను నియో రెట్రో రోడ్ స్టర్ గా భారత్ లోకి తీసుకువచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షో రూమ్). దీనికి ఎల్ ఈడీ రౌండ్ హెడ్ ల్యాంప్, 16 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటాయి.(Brixton )

బ్రిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200 ఎక్స్ మరో మోడల్. ఇది స్క్రాంబ్లర్ ఆధారిత బైక్. ఇది లిమిటెడ్ ఎడిషన్. 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 9.10 లక్షలు (ఎక్స్ షో రూమ్)

(3 / 10)

బ్రిక్స్ టన్ క్రోమ్ వెల్ 1200 ఎక్స్ మరో మోడల్. ఇది స్క్రాంబ్లర్ ఆధారిత బైక్. ఇది లిమిటెడ్ ఎడిషన్. 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 9.10 లక్షలు (ఎక్స్ షో రూమ్)(Brixton )

ఈ రెండు బైక్ ల్లో కూడా 1222 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 108 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 198 కిమీలు.

(4 / 10)

ఈ రెండు బైక్ ల్లో కూడా 1222 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 108 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 198 కిమీలు.(Brixton )

క్రోమ్ వెల్ 1200 మూడు రంగుల్లో లభిస్తుంది. అవి కార్గో గ్రీన్, టింబర్ వోల్ఫ్ గ్రే, బ్యాక్ స్టేజ్ బ్లాక్. బాడీ కలర్ లోనే సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. 

(5 / 10)

క్రోమ్ వెల్ 1200 మూడు రంగుల్లో లభిస్తుంది. అవి కార్గో గ్రీన్, టింబర్ వోల్ఫ్ గ్రే, బ్యాక్ స్టేజ్ బ్లాక్. బాడీ కలర్ లోనే సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. (Brixton )

క్రోమ్ వెల్ 1200 ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పుకున్నాం కదా. ఇది డ్రిల్డ్ అల్యూమినియం త్రాటిల్ బాడీ కవర్స్ తో వస్తుంది. అంతేకాదు, ఇది హాఫ్ వైట్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.

(6 / 10)

క్రోమ్ వెల్ 1200 ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పుకున్నాం కదా. ఇది డ్రిల్డ్ అల్యూమినియం త్రాటిల్ బాడీ కవర్స్ తో వస్తుంది. అంతేకాదు, ఇది హాఫ్ వైట్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.(Brixton )

ఈ రెండు బైక్స్ లో బ్రేకింగ్ విధులను, ముందువైపు 310 ఎంఎం డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 260 ఎంఎం డిస్క్ బ్రేక్ లు నిర్వర్తిస్తాయి. ఈ రెండు బైక్ ల్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంటుంది.

(7 / 10)

ఈ రెండు బైక్స్ లో బ్రేకింగ్ విధులను, ముందువైపు 310 ఎంఎం డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 260 ఎంఎం డిస్క్ బ్రేక్ లు నిర్వర్తిస్తాయి. ఈ రెండు బైక్ ల్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంటుంది.(Brixton )

కాయబా నుంచి సస్పెన్షన్ కాంపోనెంట్స్ ను తీసుకున్నారు. ముందువైపు 120 ఎంఎం టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. వెనుకవైపు 87 ఎంఎం ట్రావెల్ స్టీరియో షాక్స్ ఉంటాయి.

(8 / 10)

కాయబా నుంచి సస్పెన్షన్ కాంపోనెంట్స్ ను తీసుకున్నారు. ముందువైపు 120 ఎంఎం టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. వెనుకవైపు 87 ఎంఎం ట్రావెల్ స్టీరియో షాక్స్ ఉంటాయి.(Brixton )

ఈ రెండు బైక్స్ లో రౌండ్ డయల్ ఉన్న టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. రైడింగ్ మోడ్ ను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ బైక్స్ లో ఈకో, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. వీటిలో ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

(9 / 10)

ఈ రెండు బైక్స్ లో రౌండ్ డయల్ ఉన్న టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. రైడింగ్ మోడ్ ను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ బైక్స్ లో ఈకో, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. వీటిలో ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.(Brixton )

ఈ బైక్స్ లో 2 పైప్ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించారు.  

(10 / 10)

ఈ బైక్స్ లో 2 పైప్ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించారు.  (Brixton )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు