India highest paid Actor: ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా సౌత్ హీరో రికార్డ్..ఒకే మూవీకి రూ.300 కోట్లు
Highest paid Actor in India: కంగువా సినిమా మొత్తం రూ.350 కోట్లు.. ఆ మూవీ కోసం సూర్య రూ.39 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ.. ఒక సౌత్ హీరో.. ఒకే సినిమాకి ఏకంగా రూ.300 కోట్లు తీసుకున్నాడట.
ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసున్న నటుడిగా సౌత్ హీరో రికార్డ్ నెలకొల్పాడు. మొన్నటి వరకూ రూ.100 కోట్లు బెంచ్ మార్క్‌గా ఉండేది. కానీ.. ఇప్పుడు సినిమాల బడ్జెట్ వందల కోట్లు దాటిపోయింది. దాంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.
సినిమా బడ్జెట్ అంత పారితోషికం
తాజాగా వెలువడిన వార్తల ప్రకారం ఒక స్టార్ హీరో ఒకే సినిమాకు రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అతను ఎవరో కాదు.. అల్లు అర్జున్. అవును ‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
షారూక్ ఖాన్ నటించిన జవాన్, సూర్య నటించిన కంగువా వంటి సినిమాల మొత్తం బడ్జెట్ రూ.300-350 కోట్లుకాగా.. తెలుగులో అల్లు అర్జున్ ఒక్కడి రెమ్యూనరేషన్ రూ.300 కోట్లు అంటూ వార్త వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది.
రజినీకాంత్ కంటే ఎక్కువ
జైలర్ సినిమా కోసం రజినీకాంత్ రూ.250 కోట్లు వరకూ పారితోషికం తీసుకోగా.. లియో మూవీలో నటించినందుకు విజయ్ కూడా రూ.250 కోట్లు వరకూ తీసుకున్నట్లు టాక్. ఇక బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు .. తమ ప్రాఫిట్ షేర్‌తో కలిపి రూ.150-200 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే.. 2017లో దంగల్ కోసం అమీర్ ఖాన్ రూ.230 కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం.
రూ.300 కోట్లు సాధ్యమేనా?
వాస్తవానికి పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం సాధ్యమేనా? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. పాన్ ఇండియా మూవీగా రిలీజవుతున్న ఈ సినిమా రూ.1,000 కోట్లు పైనే వసూళ్లు చేస్తుందని అంచనాలు మొదలైపోయాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కూడా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ప్రాఫిట్ షేర్ అంటూ రూ.250 వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
పుష్ప 1 విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్
సుకుమార్ దర్శకత్వంలో 2021లో పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప: ది రైజ్ మూవీ.. ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టింది. రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో మూడేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ పుష్ప2పై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.
పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. షెకావత్ గా ఫహద్ ఫాజిల్ నటించారు. అలానే శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.