Powerful mantras: అనారోగ్య బాధల నుంచి గట్టేక్కించే శక్తివంతమైన మంత్రాలు ఇవే
Powerful mantras: అనారోగ్య బాధలు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయట పడేందుకు ఆధ్యాత్మిక మార్గం చక్కని తరుణోపాయం. అందుకే నిత్యం మీరు ఈ శక్తివంతమైన మంత్రాలు పఠించారంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
Powerful mantras: ఒత్తిడి, టెన్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయిపోయాయి. వీటి నుంచి బయట పడేందుకు కూడా తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడకపోతే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నేటి కాలంలో ప్రజలు మానసిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కొంతమందిలో మందులు ఉపయోగిస్తూ వాటిని కంట్రోల్ చేసుకుంటా ఉంటే మరి కొందరు ధ్యానం, యోగా అనే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఔషధాలు ప్రస్తుతం పరిష్కారం కావచ్చు కానీ శాశ్వత పరిష్కారం కాదు. అంతిమంగా ఈ సమస్య నుండి బయటపడేందుకు ఆధ్యాత్మికత మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
ఆధ్యాత్మికంగా బలపడితే సంతోషంగా ఉండగలుగుతారు. ఆందోళన రుగ్మతలు తొలగిపోతాయి. అందుకోసం ప్రతిరోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల మీలోని అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. సరైన నియమాలు పాటిస్తూ ఈ శ్లోకాలను జపించడం వల్ల జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ శక్తివంతమైన మంత్రాలు మీ అనారోగ్య సమస్యలను తొలగించి మీకు మనశ్శాంతిని ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి
మహా మృత్యుంజయ మంత్రం
మృత్యు భయాన్ని పోగొట్టడమే కాకుండా ఇతర అనేక రోగాల నుంచి బయటపడేందుకు మహా మృత్యుంజయ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సమస్యలను అధిగమించేందుకు రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు 108 సార్లు ఈ శక్తివంతమైన శివ మంత్రాన్ని పఠించాలి. "ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వరుక్మివ్ బంధనన్ మృత్యోర్ ముష్కియ మామృతాత్ ఓం" అని పఠించాలి. సాత్విక జీవనశైలిని అనుసరిస్తూ తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
శ్రీ నరసింహ మంత్రం
శ్రీ నరసింహ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రజలు తక్షణ ఉపశమనం పొందగలుగుతారు. తులసి జలమాల పట్టుకుని ఈ మంత్రాన్ని పఠించడం ప్రారంభించిన తర్వాత మీరు అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మీరు తప్పనిసరిగా సాత్విక జీవన శైలిని అనుసరించాలని గుర్తుంచుకోవాలి.
దుర్గామాత 32 పేర్లు జపించడం
దుర్గామాత 32 పేర్లు జపించడం చాలా శక్తివంతమైనది. పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రమం తప్పకుండా పఠించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలకు ముగింపు లభిస్తుంది. దుర్గాదేవి 32 పేర్లని ద్వాత్రింశ నామావళి అని పిలుస్తారు. ఎర్రచందనం రోజరీతో దుర్గామాత 32 నామాలను 108 సార్లు జపించాలి.
గాయత్రీ మంత్రం
అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి గాయత్రీ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతికూల ఆలోచనలు, భ్రమలు తొలగిపోయి జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. రుద్రాక్ష జపమాలతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే మీరు జీవితంలో అద్భుత మార్పులు చూస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, గుడ్డు, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. మద్యం, జూదానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసాను ప్రతిరోజు 11 సార్లు పఠించడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరు నెలల పాటు ఇదే విధంగా పునరావృతం చేయాలి. ఇలా చేస్తే ప్రతికూలతో తొలగించడమే కాకుండా మీ జీవితంలో నెలకొన్న అసంతృప్తి తొలగిపోతుంది. మీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు సరైన మార్గం కనబడుతుంది. సాత్విక జీవనశైలిని అనుసరిస్తూ ఈ మంత్రాలు జపించడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు.