Durga devi: దుర్గాదేవి ఈ మంత్రాలు పఠించారంటే మీకు ఏ శత్రు, దుష్టశక్తుల భయాలు ఉండవు-if you chant these mantras of goddess durga you will not have any fear of enemies or evil spirits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Durga Devi: దుర్గాదేవి ఈ మంత్రాలు పఠించారంటే మీకు ఏ శత్రు, దుష్టశక్తుల భయాలు ఉండవు

Durga devi: దుర్గాదేవి ఈ మంత్రాలు పఠించారంటే మీకు ఏ శత్రు, దుష్టశక్తుల భయాలు ఉండవు

Gunti Soundarya HT Telugu
May 10, 2024 04:57 PM IST

Durga devi: స్త్రీ శక్తి స్వరూపిణిగా దుర్గాదేవిని పూజిస్తారు. శత్రు, దుష్ట శక్తుల భయాలు తొలగిపోవాలంటే దుర్గాదేవికి సంబంధించిన ఈ మంత్రాలు నిత్యం పఠించండి. మీరు ధైర్యంగా ఉంటారు.

దుర్గాదేవి శక్తివంతమైన మంత్రాలు
దుర్గాదేవి శక్తివంతమైన మంత్రాలు

Durga devi: దైవిక స్త్రీ శక్తి స్వరూపంగా దుర్గాదేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల రక్షణ, బలం లభిస్తాయని నమ్ముతారు. నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవిని స్మరించుకుంటూ నియమాలు పాటిస్తారు.

కొంతమంది భక్తులు దుర్గాదేవి మాల కూడా ధరిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన ఈ మంత్రాలు జపించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ధైర్యంగా ఉంటారు. జీవితంలోనే అడ్డంకులను అధిగమించగలుగుతారు. శత్రు భయం తొలగిపోతుంది. దుష్ట శక్తుల నుంచి రక్షణ ఉంటుంది.

సర్వబాధ వినర్ముక్తో ధన ధాన్య స్తుతాన్వితా |

మనుష్య మాతృసాదేన భవిష్యతీ న సంశయః ||

అన్ని అడ్డంకుల నుండి విముక్తి పొందేలా చేయమని కోరుకుంటూ ఈ మంత్రాన్ని పఠిస్తారు. సంపద, ధాన్యం, సంతానానికి లోటు రాకుండా చూడమని వేడుకోవడం ఈ మంత్రం అర్థం. ఈ మంత్రం దుర్గా దేవికి అంకితం చేసిన శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సర్వబాధ వినిర్ముక్తో అనే మంత్రాన్ని పఠించడం వల్ల భక్తులు అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు. జీవితంలో సంపద, శ్రేయస్సును ఇస్తుంది. ప్రశాంతమైన, ధృడమైన మనస్సుతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. అమ్మవారి దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి.

ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలినీ|

దుర్గా క్షమా శివః ధాత్రి స్వాహా నమోస్తుతే ||

ఈ చిన్న మంత్రంలో చాలా పరమార్థం ఉంది. ఇందులో దుర్గాదేవి వివిధ రూపాలు, అవతారాల గురించి ఉంటుంది. రక్షణ, క్షమాపణ, బలం కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తారు. ఈ మంత్రాన్ని స్వచ్చమైన హృదయంతో పఠించడం ద్వారా దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. కష్టాలను అధిగమించి ప్రతికూలత నుంచి విముక్తులవుతారు. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సరైన మార్గంలో నడిచేందుకు సహాయపడుతుంది.

సర్వస్వరూపిణీ సర్వే శు సర్వశక్తిసమాన్వితే

భయోభ్యశ్రీహీ నో దేవీ దుర్గా దేవి నమోస్తుతే

అన్ని రకాల భయాలని తొలగిస్తుందని నమ్మే మంత్రం ఇది. దీన్ని నిత్యం పఠించడం వల్ల మీకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ప్రజలు జీవితంలోని అన్ని రకాల భయాలను అధిగమిస్తారు. దుర్గా దేవి నిత్య రూపాన్ని ఆరాధించడంలో సహాయపడుతుంది. భయం, అభద్రత, సవాళ్లను జయించడానికి అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి.

దేహీ సౌభాగ్య ఆరోగ్య దేహీ మే పరం సుర్మా

రూపం దేహి జయం దేహి యశో దేహీ దృషోజహీ

ఈ మంత్రం పఠించడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, ఆనందం, విజయం లభిస్తాయి. భక్తుల జీవితాల నుంచి చెడు, ప్రతికూల భయాన్ని తొలగించమని దుర్గా దేవిని వేడుకుంటారు. జీవితంలోని అన్ని కోణాల్లో శ్రేయస్సు లభిస్తుంది. నవరాత్రుల సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తారు.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

చిన్నప్పటి నుంచి చాలా మంది వింటున్న మంత్రం ఇది. శ్రేయస్సు, ఆనందం, స్వచ్చత, సానుకూలతకు కారణమైన దుర్గాదేవి తమ కోరికలను నెరవేర్చడంలో ఎలా సహాయపడుతుందో పేర్కొంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు. అంకిత భావంతో ఈ మంత్రాన్ని జపిస్తే మీరు చేపట్టే ఏ శుభ ప్రయత్నమైన అవాంతరాలు లేకుండా పూర్తి అవుతుంది. ఈ మంత్రం ద్వారా దుర్గా దేవి పట్ల ఉన్న భక్తిని వ్యక్తపరుస్తారు. మెరుగైన, మరింత సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు.