Devotional: మంత్రాలు ఎందుకు 108 సార్లు పఠిస్తారు? ఈ సంఖ్యకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి?-what is the significance of 108 number why mantra chanting 108 times ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Devotional: మంత్రాలు ఎందుకు 108 సార్లు పఠిస్తారు? ఈ సంఖ్యకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి?

Devotional: మంత్రాలు ఎందుకు 108 సార్లు పఠిస్తారు? ఈ సంఖ్యకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Mar 01, 2024 02:34 PM IST

Devotional: పూజ చేసేటప్పుడు 108 సార్లు మంత్రాలు జపిస్తారు. రుద్రాక్ష మాలలో 108 పూసలు ఉంటాయి. ఇలా 108 అనే సంఖ్య అధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే..

మంత్రాలు 108 సార్లు ఎందుకు పఠిస్తారు?
మంత్రాలు 108 సార్లు ఎందుకు పఠిస్తారు? (pixabay)

Devotional: హిందూ ధర్మ శాస్త్రంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించే రుద్రాక్షలో ఉండే పూసలు 108. మంత్రోచ్ఛారణ 108 సార్లు చేస్తారు. ప్రతి దేవుడికి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుతారు. ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంలో 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది.

yearly horoscope entry point

గ్రంథాలలోని, శ్లోకాలు, పద్యాలు అన్ని కూడా 108 ఉండేలాగే రాస్తారు. అలాగే శివలింగాలు 108. క్షీరసాగరం మథనం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా 108. అందులో దేవతలు 54 మంది ఉంటే ఆసురులు 54 మంది ఉన్నారు. అలా ప్రతి చోటా 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

సంపూర్ణతకు చిహ్నం

హిందూ మతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. పిండ రూపం దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది. ఒకటి ప్రారంభం సంఖ్య అయితే 0 అనేది శూన్యం. ఇక 8 దైవిక సంఖ్య అనంతం అంటే అంతం లేనిది అని అర్థం.

దైవానికి దగ్గరగా

మంత్రాలు, ప్రార్థనలు, శ్లోకాలు పఠించేటప్పుడు హిందూ మతంలో 108 సార్లు చదువుతారు. ఈ పవిత్రమైన శబ్దాలను, పదబంధాలను బిగ్గరగా పట్టించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని చెప్తారు. మొత్తం ధ్యాన చక్రం 108 మంత్రాలని జపించిన తర్వాతే పూర్తవుతుంది. 108 సార్లు జపించడం వల్ల దైవంతో దగ్గరగా ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రంలో..

వేద జ్యోతిష్య శాస్త్రంలో కూడా 108 అనే సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మనకు ఉన్న గ్రహాలు తొమ్మిది, రాశి చక్రాలు పన్నెండు. ఈ రెండింటినీ గుణిస్తే వచ్చేది (12*9)108. ఈ సంఖ్య సంబంధం విశ్వం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది కూడా తెలుపుతుంది. నక్షత్రాలు మానవ ఉనికిపై చాలా ప్రభావం చూపిస్తాయి. మొత్తం నక్షత్రాలు 27 కాగా నాలుగు పాదాలు ఉంటాయి. ఇవి రెండిటినీ కలిపితే (27*4)108 అవుతుంది.

ప్రాచీన కాలం నుంచి 108 అనే సంఖ్య ఉపయోగిస్తూ వచ్చారు. వైష్ణవ పురాణం ప్రకారం దేశంలోనే ప్రముఖ విష్ణు దేవాలయాలు 108. క్షీరసాగరాన్ని మధించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారు.

భూమి, చంద్రుడు, సూర్యుడు మధ్య వ్యాసం

భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్య సగటు దూరానికి కూడా 108 సంఖ్యకు ముడిపడి ఉంటుంది. సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికి, భూమికి మధ్య దూరం తెలుస్తుంది. అలాగే చంద్రుడు వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికి భూమికి మధ్య దూరం తెలుస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం కూడా మన శరీరంలో 108 మర్మ స్థానాలు ఉంటాయి. యోగా సంప్రదాయం ప్రకారం మానవ శరీరం ఏడు ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలతో కూడి ఉంటుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్వహించడం ఈ చక్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక సమతుల్యతను అవగాహనను సాధించడానికి ఈ శక్తులను సమలేఖనం చేయడం చాలా అవసరం.

Whats_app_banner