Sun, saturn nakshtra transit: 100 ఏళ్ల తర్వాత ఒకేరోజు నక్షత్రాలు మారబోతున్న సూర్య, శని గ్రహాలు
Sun, saturn nakshtra transit: శత్రు గ్రహాలుగా పేర్కొనే సూర్యుడు, శని గ్రహాలు ఒకే రోజున తమ నక్షత్రాలు మార్చుకోబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగించి ఆదాయాన్ని పెంచుతుంది.
Sun, saturn nakshtra transit: గ్రహాల రాజుగా సూర్య గ్రహాన్ని పరిగణిస్తారు. నెలకి ఒక సారి రాశి చక్రం మార్చుకుంటూ సంచరిస్తుంది. ఇక అందరూ చూసి భయపడేది శని గ్రహానికి. కర్మల అనుసారం ప్రతిఫలాలు ఇస్తాడు శని దేవుడు. సూర్యుడు, శని మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉంది. కానీ విచిత్రంగా ఇవి రెండు గ్రహాలు శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు.
ఒక్కో గ్రహం ఎప్పటికప్పుడు రాశి చక్రాన్ని మాత్రమే కాదు నక్షత్రాన్ని మారుస్తుంది. ఆ ప్రభావం 12 రాశుల మీద చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పుకు మాత్రమే కాదు నక్షత్ర మార్పుకి అధిక ప్రాధాన్యత ఉంది. సూర్యుడు రాశి మారేందుకు నెల సమయం పడితే శనికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అలా ఈ ఏడాది శని 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం ఈ రాశిలోనే శని తన స్థానం మార్చుకుంటూ ప్రయాణం చేస్తాడు. ఇదే రాశిలోకి సూర్యుడు కూడా రాబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో సూర్యుడు కుంభ రాశి సంచారం చేయనున్నాడు.
ఈ ఏడాది సూర్య, శని గ్రహాలు ఒకే రాశిలోకి రావడం మాత్రమే కాదు ఈ రెండు గ్రహాలు ఒకే రోజున తమ నక్షత్రాలు మార్చుకోబోతున్నాయి. సుమారు 100 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతం జరగబోతుంది. ప్రస్తుతం శ్రవణా నక్షత్రంలో ఉన్న సూర్యుడు ఉత్తరాషాడ నక్షత్రంలోకి రానుండగా, శని శతభిష నక్షత్రంలోకి వెళతాడు. శతభిష నక్షత్రానికి రాహువు అధిపతి. సూర్య, శని నక్షత్ర మార్పులు అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. కానీ మూడు రాశుల జాతకులకి మాత్రం అదృష్టంగా మారబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవంటే..
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని, సూర్య గ్రహాల నక్షత్రాల మార్పు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. భార్యాభర్తలకు పుత్రోత్సాహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి జాతకులు కొత్త వాహనం, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ గుండె ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. తమకి కేటాయించిన పనులు సరైన సమయంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు.
కన్యా రాశి
సూర్య, శని గ్రహాల నక్షత్ర మార్పు కన్యారాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం చూసే నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ లభించి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. విదేశాలకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా మారుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు, కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
వృషభ రాశి
రెండు గ్రహాల సంచారం వృషభ రాశి వారికి ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వ్యాపారస్థులకి ఆదాయం వచ్చే నూతన మార్గాలు కనిపిస్తాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఇది ఉత్తమ సమయం. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు గడిస్తారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే ఆశించిన లాభం వస్తుంది.