Kumbha Rasi 2024: కుంభ రాశికి కష్టాలు ఉన్నా కొత్త సంవత్సరంలో కలిసొస్తుంది-kumbha rasi 2024 new year rasi phalalu check your aquarius zodiac sign for yearly horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kumbha Rasi 2024: కుంభ రాశికి కష్టాలు ఉన్నా కొత్త సంవత్సరంలో కలిసొస్తుంది

Kumbha Rasi 2024: కుంభ రాశికి కష్టాలు ఉన్నా కొత్త సంవత్సరంలో కలిసొస్తుంది

HT Telugu Desk HT Telugu
Dec 21, 2023 09:35 AM IST

Kumbha Rasi 2024: కుంభ రాశి జాతకులకు 2024 సంవత్సరంలో రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. నూతన సంవత్సరంలో మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోగలరు.

Kumbha Rasi 2024: కుంభ రాశి జాతకులకు 2024 సంవత్సరంలో రాశి ఫలాలు
Kumbha Rasi 2024: కుంభ రాశి జాతకులకు 2024 సంవత్సరంలో రాశి ఫలాలు (Pixabay)

కుంభరాశి జాతకులకు 2024వ సంవత్సరంలో శని జన్మరాశిలో సంచరించుటచేత ఏలినాటి శని ప్రభావం వలన ఇబ్బందులు కలిగినప్పటికి 2024 సంవత్సరంలో మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు వలన కుంభరాశికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

జనవరి నుండి ఏప్రిల్‌ వరకు గురుడు తృతీయ స్థానములో ప్రతికూలముగా ఉండటం చేత మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, పనులయందు చికాకులు, కుటుంబ సమస్యలు కొంత వేధించును.

మే నుండి డిసెంబర్‌ వరకు చతుర్ధంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం వలన కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.

కుంభరాశిస్త్రీలకు 2024 మార్చు తెచ్చేటటువంటి సంవత్సరం. ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలసివచ్చును. కుంభరాశి విద్యార్థులకు 2024 సంవత్సరం ద్వితీయార్థం బాగా కలసివస్తుంది.

కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాలలో 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశివారిని కొంత ఇబ్బంది పెట్టును.

కుంభరాశి రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం అంత కలసిరాదు. మొత్తంమీద 2024 సంవత్సరం కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కుంభ రాశి 2024 ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలసిరావు. 2024 ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు, మానసిక ఇబ్బందులుతో కూడినటువంటి వాతావరణం ఏర్పడును. 2024 తృతీయార్ధంలో కుంభరాశికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూలించును. మొత్తం మీద కుంభరాశికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో 2024 మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.

కుంభ రాశి 2024 ఆర్థిక విషయాలు

2024 సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక విషయాలలో గత కొంత కాలముగా అనేక సమస్యలు ఏర్చడుచున్నవి. ధనము నిలవ ఉండకపోవడం, ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంత కాలముగా కుంభరాశిని ఇబ్బందిపెడుతున్న అంశాలు.

2024 సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్‌ వరకు కుంభరాశికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు సమస్యలు వేధించును. మే నుండి జూన్‌ వరకు కుంభరాశికి ఆర్థిక స్థితిగతులలో మార్పు చేకూరును.

2024 సంవత్సరం ద్వితీయార్థం ఆర్థికపరమైనటువంటి విషయాలలో పురోగతి కలుగును. మొత్తంమీద 2024 సంవత్సరం కుంభరాశికి ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కుంభరాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను.

కుంభరాశి 2024 కెరీర్

2024 సంవత్సరం కుంభరాశి వారికి కెరీర్ పరంగా మార్పు సంభవించు సంవత్సరం. ఎవరైతే కెరీర్‌పరంగా ప్రస్తుతం పనిచేయు ఉద్యోగాలలో మార్పు కోరుచున్నారో వారికి 2024లో ఉద్యోగమార్పు కలుగు సూచన. 2024 ప్రథమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉన్నది. మే నుండి డిసెంబర్‌ మధ్య సమయం కుంభరాశి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు కలుగును.

కుంభ రాశి 2024 అరోగ్యం

2024 సంవత్సరం కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కలసివచ్చును. జనవరి నుండి మార్చి సమయం కుంభరాశి వారు అరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఏర్పడు సూచనలు అధికముగా ఉన్నాయి. 2024 ద్వితీయార్థం అరోగ్య పరమైనటువంటి విషయాల్లో కుంభరాశికి అనుకూలించును. 45 ఏళ్ళు దాటినవారు జన్మ శని వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి సూచనలున్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభరాశి 2024 పరిహారాలు

కుంభ రాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నీలం ఉంగరం ధరించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Whats_app_banner