Mars transit: శని రాశిలోకి కుజుడు ఈ రాశులకు కనక వర్షం-mars transit horoscope mars enter into shani makara rashi these zodiac signs will get money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: శని రాశిలోకి కుజుడు ఈ రాశులకు కనక వర్షం

Mars transit: శని రాశిలోకి కుజుడు ఈ రాశులకు కనక వర్షం

Gunti Soundarya HT Telugu

Mars transit: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ధనుస్సు రాశిలో ఉన్న అంగారకుడు మరో రెండు రోజుల్లో శనికి చెందిన మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.

మకర రాశిలోకి కుజుడు సంచారం

Mars transit: అన్ని గ్రహాలకి అధిపతిగా పరిగణించే అంగారకుడు శని రాశి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శౌర్యం, పరాక్రమం, ధైర్యం, శక్తి, బలం వంటి వాటికి కుజుడు ప్రతీకగా నిలుస్తాడు. ఫిబ్రవరి 5న కుజుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పటికే ఈ రాశిలో గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా ఉన్నాడు.

ఫిబ్రవరి 1న బుధుడు మకర రాశి ప్రవేశం చేశాడు. శని మకర రాశిలోకి కుజుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. మరికొన్ని రాశుల వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. కుజుడు రాశి మార్పు మేషం నుంచి మీన రాశి వరకు ప్రభావం చూపుతుంది. అయితే ఏ రాశులకి అంగారక సంచారం శుభప్రదం కాబోతుందో చూద్దాం.

మేషం

కుజుడు రాశి మార్పు మేష రాశి వారికి శుభ ప్రయోజనాలు ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. నూతన విజయాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేష రాశికి కుజుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారి మీద అంగారకుడి అనుగ్రహం ఉంటుంది. పని చేసే చోట అధికారుల నుంచి సహకారం లభిస్తుంది.

వృషభ రాశి

అంగారకుడి సంచారం వృషభ రాశి వారికి ఆదాయం పెంచుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శ్రమకి తగిన ప్రతిఫలం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది.

మిథున రాశి

స్నేహితుల సహాయంతో వ్యాపారంలో విస్తరించుకుంటారు. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి యాత్రకి వెళతారు. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మాటలకి ఇతరులు సులభంగా ఆకర్షితులు అవుతారు. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

మకర రాశి

అంగారకుడు మకర రాశిలోకే ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. శుభ కార్యాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. విద్యాపరమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వస్తు సంపద పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి

పాత మిత్రులని కలుసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ రాశులకి సమస్యలే

అంగరాకుడు సంచారం మరికొన్ని రాశులకి అశుభ ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి జాతకులు హనుమంతుడిని ఆరాధించాలి. ఈ రాశి జాతకులు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

శని రాశి మకర రాశిలోకి కుజుడు రాకతో కన్యా రాశి వారి సంబంధ బాంధవ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. భాగస్వామితో వాదించడం మానుకోండి. ఆర్థిక విషయాల్లో లాభాలు ఆశిస్తారు.

అంగారక సంచారం తులా రాశి వారికి లాభదాయకం కాదు. ఈ రాశి వారు శనితో పాటు కుజుడిని పూజిస్తే మంచి ఫలితాలు జరుగుతాయి. శని పరిహారాలు పాటించవచ్చు.