Mesha Rasi 2024: మేష రాశి ఫలాలు.. ధన యోగం సహా అన్నీ శుభ యోగాలే
Mesha Rasi Phalalu 2024: మేష రాశి వారికి 2024లో ధనయోగం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 2024 సంవత్సరంలో మేష రాశి జాతకుల ఆదాయం, కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
2024వ సంవత్సరం మేషరాశి వారికి బాగా కలసివచ్చేటటువంటి సంవత్సరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు. 2024వ సంవత్సరంలో లాభస్థానములో శని మేషరాశి వారికి లాధభదాయకముగా ఉండటం, గురుడు మే మాసములో ధన స్థానములో ప్రవేశించడం, కేతువు 6 స్థానములో అనుకూల స్థితిలో ఉండటం వలన మేషరాశి వారికి 2024 ధనయోగం, శుభయోగం ఉందని చిలకమర్తి తెలియచేశారు.
2024 సంవత్సరం మేషరాశివారికి నూతన వస్తు యోగం, నూతన గృహ యోగం వంటి యోగములు కలుగు అవకాశములు అధికముగా ఉన్నాయని చిలకమర్తి తెలిపారు. మేషరాశి ఉద్యోగస్తులకు 2024లో ప్రమోషన్లు లభించును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభము కలుగును.
మేషరాశి వ్యాపారస్తులకు 2024 వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును. వ్యాపారమునందు విజయములు మరియు ధనలాభము కలుగును. ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశివారికి 2024లో ప్రథమార్థంలో స్వల్చ అనారోగ్య సమస్యలు ఏర్పడును.
జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యము అనుకూలముగా ఉండును. మేషరాశి వారికి 2024 సంవత్సరము కెరియర్‌పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మేషరాశి వారికి 2024 సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితపరంగా కలసివచ్చేటటువంటి సంవత్సరం, ప్రేమ విషయాలు సఫలీకృతమవుతాయని అవివాహితులకు వివాహయోగముందని, కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందెదరని చిలకమర్తి తెలిపారు. మేషరాశివారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభఫలితాలు పొందుతారని కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగు సంవత్సరమని, ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
మేష రాశి వారి 2024 ప్రేమ జీవితం
2024 సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం ప్రథమార్ధం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం కలసివచ్చును. మేషరాశి వారికి మొదటి 3 నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మధ్యస్థ ఫలితాలు కలుగునని ఆఖరి 9 నెలలలో ప్రేమ జీవితము మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో అనుకూల మరియు అనంద ఫలితాలు లభించును అని చిలకమర్తి తెలిపారు. మేషరాశి దాంపత్య జీవితములో ఉన్న వారికి ఈ సంవత్సరం సుఖము, సౌఖ్యము, అనందము మరియు శారీరక భోగము కలుగును.
మేష రాశి వారి 2024 ఆర్థిక విషయాలు
మేష రాశి వారికి గత కొంత కాలముతో పోల్చుకుంటే 2024 సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించును. లాభస్థానములో శని అనుకూలత వలన ధన స్థానములో గురుని ప్రవేశం వలన 2024 సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును.
మేషరాశి వారికి జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఆర్థిక విషయాలలో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధించును. మే 2024 నుండి మేషరాశి వారికి ఆర్థికపరంగా లాభము, విజయము కలుగును.
మేష రాశి వారి 2024 కెరీర్ ఫలితాలు
మేషరాశి వారికి 2024 ప్రథమార్థం కెరీర్ పరంగా స్వల్చ్బ ఇబ్బందులు మరియు పనుల యందు ఒత్తిళ్ళు ఏర్పడును. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభఫలితాలు కలుగుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు జన్మ గురుని ప్రభావంచేత మేషరాశి వారికి పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు మరియు సమస్యలు వేధించును. మే మాసం నుండి వాక్ స్థానములో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ సమయం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించును.
మేష రాశి 2024 ఆరోగ్యం
మేషరాశి వారికి గత కొంతకాలముతో పోల్చుకుంటే 2024వ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలముగా ఉండును అని చిలకమర్తి తెలిపారు. మొదటి 5 నెలల్లో అనగా జనవరి 2024 నుండి మే 2024 వరకు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించడం మంచిది. మేషరాశి వారికి ఈ 5 నెలలో టెన్నన్ల వల్ల అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు ఉన్నాయి. మే 2024 నుండి సంవత్సర అంత్యము వరకు మేషరాశి వారికి ఆరోగ్యము అనుకూలించును. అరోగ్య విషయాల కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది.
మేష రాశి జాతకులు 2024లో చేయాల్సిన పరిహారాలు
మేషరాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన వంటివి చేయడం, శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
మేషరాశివారు ధరించవలసిన నవరత్నం పగడము. మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి (అమ్మవారు) అని అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.