2023 Mesha Rasi phalalu: 2023వ సంవత్సరం మేషరాశి ఫలాలు.. వీరికి తిరుగులేదు-mesha rasi phalalu find horoscope prediction for aries in telugu for year 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Mesha Rasi Phalalu Find Horoscope Prediction For Aries In Telugu For Year 2023

2023 Mesha Rasi phalalu: 2023వ సంవత్సరం మేషరాశి ఫలాలు.. వీరికి తిరుగులేదు

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 10:23 AM IST

2023 mesha rasi phalalu: నూతన సంవత్సరంలో మేష రాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 మేషరాశి రాశిఫలాలు ఇక్కడ చూడండి.

2023 mesha rasi phalalu: మేష రాశి వారికి 2023 బాగుంటుందన్న చిలకమర్తి
2023 mesha rasi phalalu: మేష రాశి వారికి 2023 బాగుంటుందన్న చిలకమర్తి

చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి వారికి తిరుగు లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మేషరాశి వారికి ఏప్రిల్ వరకు గురుడు వ్యయ స్థానం, ఏప్రిల్ నుండి సంవత్సరం చివరి వరకు గురుడు జన్మరాశి యందు సంచరించుట వలన పనుల యందు శారీరక శ్రమ, ధన వ్యయం, ఒత్తిళ్ళు అధికముగా ఉండును.

శని కుంభరాశి లో సంచారము చేత మేషరాశి వారికి ఏప్రిల్ మాసం నుండి అన్ని కలసి వచ్చును. 2023వ సంవత్సరంలో మేషరాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలుగును. మేషరాశి వ్యాపారస్తులకు 2023 అనుకూలమైన ఫలితాలు కనబడతాయి.

మేషరాశి స్త్రీలకు 2023లో మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి విద్యార్థులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును.

మేష రాశికి 2023 శుభ ఫలాలు

మొత్తం మీద మేషరాశి వారికి 2023లో శుభ ఫలితాలు అధికముగా కనబడుచున్నవి. మేషరాశి వారికి 2023 అదృష్ట సంవత్సరము. కుటుంబములో ఉన్న అనేక సమస్యలు ఒక కొలిక్కి వచ్చును. విదేశీ ప్రయాణములు అనుకూలించును. వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకముగా ఉండును. 2023వ సంవత్సరంలో మేషరాశి వారికి శని అనుకూలమైనటువంటి ఫలితాలు అధికముగా ఇచ్చును.

మేషరాశి వారికి 2023 కుటుంబ సౌఖ్యము కలుగును. వివాహము కాని వారికి వివాహ యోగము ఉన్నది. మేషరాశి వారికి ఈ సంవత్సరం దైవ దర్శనాలు, తీర్థయాత్రలు అనుకూలించును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు ధనలాభము కలుగు సూచనలు అధికముగా ఉన్నవి. మేషరాశివారు ఆర్భాటం కోసము ధనమును అధికముగా ఖర్చు చేసెదరు.

మేషరాశి వారు శుభ ఫలాల కోసం ఇలా చేయాలి

మేషరాశివారు 2023లో మరింత శుభఫలితాలు పొందడం కోసం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, శనివారం దుర్గాదేవిని పూజించడం వలన ఉత్తమ ఫలితాలు పొందెదరు. మేషరాశివారు ధరించవలసినటువంటి ఉంగరము పగడము. మేషరాశివారు పగడము ధరించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారు ధరించవలసినటువంటి రుద్రాక్ష మూడు ముఖములు గల రుద్రాక్ష ధారణము చేత శుభఫలితాలు ఏర్పడును.

మేషరాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం వంటివి చదువుకోవడం వలన 2023లో మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
WhatsApp channel