Aries Horoscope | మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మేషరాశి రాశి గురించి తెలుసుకుందాం.
Ugadi Panchangam | అశ్విని - 1,2,3,4 పాదములు, భరణి -1,2,3,4 పాదములు, కృత్తిక - 1వ పాదము
* ఆదాయం-14
* వ్యయం-14
* రాజ్యపూజ్యం-3
* అవమానం-6
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా బృహస్పతి వ్యయ స్థానమందు సంచరించుట, శని లాభ స్థానము, వక్రియై దశమ స్థానమునందు సంచరించుట, రాహువు జన్మ రాశియగు 1వ స్థానమందు సంచరించుట కేతువు సప్తమ స్థానమునందు సంచరించుట చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. మేషరాశివారికి రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుటుంబమునందు కలహములు, కష్టములు అధికంగా ఉంటాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య శని వక్రియై ఉండుటచేత కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చికాకులు అధికంగా ఉంటాయి. బృహస్పతి వ్యయములో సంచరించుట చేత ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ సంవత్సరం స్థానమార్పు, ఇబ్బందులు కలిగే అవకాశముంది.
మేషరాశివారికి జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూలమైన ఫలితములు లభిస్తాయి. ఈ సమయంలో ధనలాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, కుటుంబము నందు వ్యతిరేకత, ధన సంపాదనయందు నష్టము, ఖర్చు ఈ సంవత్సరములో అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. స్త్రీలకు ఇది మధ్యస్థ సమయం. కుటుంబంలో సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. రాజకీయ నాయకులకు ఇది మధ్యస్థ కాలము. రైతులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేఘరాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే.. మంగళవారం రోజు విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, శనివారం రోజున రాహువు కాల సమయంలో దుర్గాదేవిని పూజించటం, గురువారం రోజున దత్తాత్రేయుని పూజించాలి.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసము అనుకూలంగా లేదు. గొడవలు, చికాకులు, అనవసరపు ప్రయాణాలు, ఖర్చులు, ఇబ్బందులు కలుగును. ధనాదాయం బాగుంటుంది.
మే - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. చాలా సమస్యలు కొలిక్కి వస్తాయి. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఆర్థిక విషయాలు కొంత కుదుటపడతాయి.
జూన్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ధన వ్యయం అధికముగా ఉన్నది. వృత్తి వ్యాపారములందు అభివృద్ధి కలుగును.
జూలై - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. అన్నిటిలో విజయం. శారీరక సమస్యలు, దృష్టి కారణంగా చికాకులు. సోదరులకు, సంతానమునకు శుభఫలితములు. అనవసరపు ఖర్చులు.
ఆగస్టు - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతారు. దూరప్రాంతాల నుంచి అందవలసిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి,
సెప్టెంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు కలగబోతున్నాయి. మానసిక ఇబ్బందులు, తల్లిదండ్రులకు అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నిందల పాలవుతారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి.
అక్టోబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గతంలో బాధలు తొలగి వరుస విజయాలు సొంతమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి. అధికారులతో చికాకులు, నిందలు పడవలసివస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
నవంబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవాలు, ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. గృహమందు శుభకార్యములు, భూ, భవన లాభములు కలుగును. కుటుంబసభ్యుల మధ్య సర్దుబాటు జరుగును.
డిసెంబర్ - ఈ మాసం మీకు ఘర్షణలతో అంత అనుకూలంగా లేదు. అధికారులతో విరోధములు, సంతానమునకు ఇబ్బందులు, నిందలు పాలవుతారు. మానసిక, శారీరక సుఖములు పొందుదురు. ఆర్థికంగా అభివృద్ధి కలుగును.
జనవరి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు, ప్రయాణములయందు ప్రమాదములు. శారీరక, మానసిక ఇబ్బందులు కలుగును. ధననష్టం ఎక్కువగా ఉండును.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు అద్భుతంగా ఉన్నది. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో సఖ్యంగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు.
మార్చి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలించును. శుభఫలితాలు పొందుతారు. ఖరీదైన విలాసవంతమైన జీవితం గడుపుతారు. అశాంతితో బాధపడతారు. ఇంట, బయట గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. చెపట్టిన పనులు విజయవతంగా పూర్తి చేస్తారు.
సంబంధిత కథనం