Solar eclipse 2024: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశులకు అదృష్టం తెస్తుంది-solar eclipse in 2024 the first solar eclipse in this year these zodiac signs will get profits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Solar Eclipse 2024: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశులకు అదృష్టం తెస్తుంది

Solar eclipse 2024: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశులకు అదృష్టం తెస్తుంది

Gunti Soundarya HT Telugu
Feb 02, 2024 11:00 AM IST

Solar eclipse 2024: 2024 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 8వ తేదీ వచ్చింది. ఈ గ్రహణంతో కొన్ని రాశుల వారు ఆకస్మిక ప్రయోజనాలు అందుకోబోతున్నారు.

 సూర్య గ్రహణం
సూర్య గ్రహణం (pixabay)

Solar eclipse 2024: ఈ ఏడాది ఏర్పడబోయే మొదటి సూర్య గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. 2024 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహం ఏప్రిల్ 8వ తేదీ జరగబోతుంది. చైత్రమాసం అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య రోజు ఏర్పడే గ్రహణం శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

సూర్య గ్రహణం ఫసిఫిక్, అట్లాంటిక్, మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగాలలో కనిపిస్తుంది. కానీ భారతదేశంలో సూర్య గ్రహణం కనిపించదు. అందుకే గ్రహణ సమయంలో వచ్చే సూతక కాల ప్రభావం కూడా ఉండదు. కానీ ఈ సూర్య గ్రహణం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు చేకూర్చనుంది. సూర్య గ్రహణం నుంచి ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోవడంతో పాటు సమాజంలో పరపతి పెరుగుతుంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

మేష రాశి

2024 లో వచ్చే మొదటి సూర్య గ్రహణం మేష రాశి జాతకులకి ఒక వరం మారి శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. విద్యారంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ రాశి వాళ్ళు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలతో తమ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ సమయంలో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా, బలంగా ఉంటుంది.

మిథున రాశి

సూర్య గ్రహణ ప్రభావం వల్ల మిథున రాశి వాళ్ళు గతంలో నిలిచిపోయిన పనులని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మార్గాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం రొమాంటిక్ గా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వారు సూర్యగ్రహణం కారణంగా విజయాలు సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఉత్తమ లాభాలు అందుతాయి.

సింహ రాశి

పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి వాటి నుంచి లాభాలు పొందేందుకు ఇది శుభ సమయం. ఉద్యోగస్థులకి పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ కాలంలో చేసే ప్రయాణాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. ఉద్యోగంలో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వేత్తలకి ఇది అనువైన సమయం.

కన్యా రాశి

ఈ ఏడాది వచ్చే మొదటి సూర్య గ్రహణం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. అధిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్న వారికి వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. శ్రమకి తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. కొత్తగా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ వార్తలు వింటారు.

ధనుస్సు రాశి

సూర్య గ్రహణంతో ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు, సహనంతో పని చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగులకి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు భారీ లాభాలు పొందుతారు.