Sun nakshatra transit: శ్రవణా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల జాతకులకి ధన ప్రాప్తి-sun transit surya enter into shravana nakshatra these zodiac signs will get rich ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Nakshatra Transit: శ్రవణా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల జాతకులకి ధన ప్రాప్తి

Sun nakshatra transit: శ్రవణా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల జాతకులకి ధన ప్రాప్తి

Gunti Soundarya HT Telugu
Jan 26, 2024 07:00 AM IST

Sun nakshatra transit: సూర్యుడు నక్షత్ర మార్పు జరగడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. కొన్ని రాశుల వాళ్ళు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం.

నక్షత్రం మారిన సూర్యుడు
నక్షత్రం మారిన సూర్యుడు

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాలన్నింటిలోని మొదటిది ఇదే. అందుకే గ్రహాలకి రాజు అంటారు. సూర్య భగవానుడు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. జనవరి 24 న సూర్యుడు శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్య నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. సూర్యుడు నక్షత్ర మండలాన్ని మార్చడం వల్ల మీన రాశి నుంచి మేష రాశి వరకు ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుందో చూద్దాం.

మేష రాశి

సూర్యుడు నక్షత్రాన్ని మార్చుకోవడం వల్ల మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మనసు సంతోషంగా ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. కోపానికి దూరంగా ఉండండి. మాట ప్రభావం పెరుగుతుంది. ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. విజయానికి మార్గాలు తెరుచుకుంటాయి. సంపద పెరుగుదల ఉంటుంది.

వృషభం

వృషభ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు సంతోషంతో పొంగిపోతుంది. కొన్ని సందర్భాలలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. స్వీయ నియంత్రణ తప్పనిసరి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మిథునం

మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. మానసిక ప్రశాంతత కాపాడుకునేందుకు ప్రయత్నించండి. విద్యాపరమైన పనులు మెరుగుపడతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.

సింహ రాశి

విద్య, మేధోపరమైన పనుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అదే విధంగా ఒకింత ఖర్చులు పెరుగుతాయి.

కన్య

సంయమనం పాటించండి. అర్థరహితమైన కోపాన్ని విడనాడాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరిస్థితులు సంతృప్తి కరంగా ఉంటాయి. ఈ రాశి వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది.

తులా రాశి

సూర్యుడు నక్షత్రం మారడం వల్ల తులా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మనసు ఆనందంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా కలిసి ఉంటారు. మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.

వృశ్చికం

ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. కానీ మనసు మాత్రం చంచలంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభావకాశాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు

మనసు సంతోషంగా ఉన్నా కూడా మీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రి సహకారం లభిస్తుంది.

మకర రాశి

మనసు కలత చెందుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభావకాశాలు ఉంటాయి. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు.

కుంభం

మాటల్లో మాధుర్యం ఉంటుంది. సహనంతో వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అకడమిక్ పనిలలో విజయం సాధిస్తారు. గౌరవం లభిస్తుంది. ప్రభుత్వ సహకారం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.

మీన రాశి

మీ మనసు సంతోషంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతతని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులని కలుసుకుంటారు. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.