Rahu ketu transit: రాహు కేతు నక్షత్ర మార్పు.. ఈ ఐదు రాశుల జీవితంలో ఒడిదుడుకులు-rahu ketu good and bad effect on these zodiac signs in 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Ketu Transit: రాహు కేతు నక్షత్ర మార్పు.. ఈ ఐదు రాశుల జీవితంలో ఒడిదుడుకులు

Rahu ketu transit: రాహు కేతు నక్షత్ర మార్పు.. ఈ ఐదు రాశుల జీవితంలో ఒడిదుడుకులు

Gunti Soundarya HT Telugu
Jan 12, 2024 09:00 AM IST

Rahu ketu transit: రాహు, కేతు నీడ గ్రహాలు నక్షత్ర మార్పు అన్ని రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

రాహు కేతు సంచార ప్రభావం
రాహు కేతు సంచార ప్రభావం

Rahu ketu transit: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువు నీడ గ్రహాలుగా చెప్తారు. ఇవి రెండూ అశుభ ఫలితాలు ఇస్తారని అందరూ భయపడతారు. కానీ రాహు, కేతువులు అశుభ ఫలితాలు మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా అందిస్తారు. రాహు, కేతువులు శుభప్రదంగా ఉంటే ఒక వ్యక్తి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.

2024 లో రాహు కేతువులు తమ రాశి చక్రాన్ని మార్చుకున్నాయి. రేవతి నక్షత్రం మూడో దశలోకి రాహువు ప్రవేశిస్తాడు. కేతు చిత్ర నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించాడు. ఇవి రెండూ ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే కదులుతాయి. రాహు కేతువులు నక్షత్ర రాశులని మార్చగానే కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతుంది. కొన్ని రాశుల వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాహు కేతువులు నక్షత్ర రాశులని మార్చడం వల్ల అన్ని రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి

రాహు కేతు ప్రభావం వల్ల మేష రాశి వారి మనసు కలత చెందుతుంది. కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనసు మాత్రం ఆందోళనగా ఉంటుంది. కుటుంబ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. బిజిబిజీ లైఫ్ ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథున రాశి

ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ మనసు కాలతగా ఉంటుంది. కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దు. తండ్రి నుంచి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది.

కర్కాటకం

సంయమనం పాటించాలి. మితిమీరిన కోపం వ్యామోహానికి దూరంగా ఉండాలి. స్నేహితుల సహాయంతో వ్యాపార అవకాశాలు లభిస్తాయి. హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. లాభసాటి అవకాశాలు వస్తాయి.

సింహం

రాహు కేతు ప్రభావం వల్ల సింహ రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. పాత మిత్రులని కలుసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం కుటుంబం నుంచి ధనాన్ని పొందుతారు.

కన్య

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. కానీ పని పరిధిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహన సుఖం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

తులా రాశి

మనసు చంచలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కెరీర్ లో ఎదుగుదలకి అవకాశాలు లభిస్తాయి. పని పరిధి కూడా పెరుగుతుంది. హార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది.

వృశ్చికం

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

అర్థ రహితమైన కోపాన్ని ప్రదర్శించడం మానుకోండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వ్యాపారం విస్తరించేందుకు తండ్రి నుంచి డబ్బు పొందుతారు.

మకరం

ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కానీ మనసు మాత్రం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కుడుటపడుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. లాభసాటి అవకాశాలు ఉన్నాయి.

కుంభం

మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. స్వీయ నియంత్రణ చాలా అవసరం. కోపానికి దూరంగా ఉండండి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. తండ్రి నుంచి ఆస్తి, డబ్బు పొందుతారు.

మీనం

మనసు సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. మేధోపరమైన పనుల్లో గౌరవం ఉంటుంది.