Sun saturn conjunction: శని సూర్యుడి కలయికతో ఈ రాశుల వారి జీవితంలో టెన్షన్.. ఈ పరిహారాలు పాటిస్తే మంచిది
Sun saturn conjunction: గ్రహాల రాజు సూర్యుడు, కర్మల ఫలదాత శని కలయిక కుంభ రాశిలో జరిగింది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అశుభ పరిణామాలు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది.
Sun saturn conjunction: గ్రహాల రాజు సూర్యుడు తన కుమారుడు సొంత రాశి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటు ఇదే రారాశిలో తన ప్రయాణం జరుగుతుంది. ఇప్పటికే కుంభ రాశిలో గతేడాది నుంచి శని సంచరిస్తున్నాడు. కుంభ రాశిలో శని, సూర్యుడు కలయిక జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి రెండూ శత్రు గ్రహాలు.
సూర్యుడు, శని కలయిక కారణంగా కొన్ని రాశుల జాతకులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. సూర్యుడు నెలకి ఒకసారి రాశి చక్రం మారితే శని మాత్రం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి చక్రం మారుస్తాడు. అలా ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కుంభ రాశిలో కలుసుకున్నాయి. మార్చి 13 వరకు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. ఫలితంగా ఏయే రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలో చూద్దాం. అలాగే ఈ రెండింటి చెడు ప్రభావాలు తగ్గించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ధనుస్సు
సూర్యుడు, శని మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నప్పటికీ ఇవి రెండు శత్రు గ్రహాలుగా పేర్కొంటారు. కుంభ రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారికి అంతగా ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. మితిమీరిన ఖర్చుల వల్ల మనసులో అశాంతి నెలకొంటుంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
సూర్య, శని కలయిక కర్కాటక రాశి వారికి అశుభ ఫలితాలు ఇవ్వనుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పులు జరగవచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనసులో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది. భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దాంపత్య జీవితంలో చిక్కులు ఉంటాయి. కొన్ని పరిస్థితుల రీత్యా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్యా రాశి
శత్రు గ్రహాల ఈ కలయిక కన్యా రాశి వారికి ఇబ్బందులు తీసుకురాబోతుంది. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో అనేక సవాళ్ళని ఎదుర్కొంటారు. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలోని సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.
సూర్య, శని అనుగ్రహం పొందే పరిహారాలు
శని, సూర్యుడు సంయోగం వల్ల ఎదురయ్యే చెడు ప్రభావాలు తగ్గించడానికి కొన్ని పరిహారాలు పాటించవల్సి ఉంటుంది. ప్రతిరోజూ శని చాలీసా, సూర్య చాలీసా పఠించాలి. అలాగే శనికి ప్రీతికరమైన శమీ వృక్షాన్ని, రావి చెట్టుని పూజించాలి. శనివారం రావి చెట్టుకి, శమీ వృక్షానికి నీరు సమర్పించండి. సాయంత్రం వేళ ఆవనూనెలో నల్ల నువ్వులు కలిపి చెట్టు ముందు దీపం వెలిగించండి. రోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రెండు గ్రహాల చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.