Jaya Ekadashi 2024: రేపే జయ ఏకాదశి.. ఈ పరిహారాలు పాటించారంటే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి
Jaya Ekadashi 2024: విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఏకాదశి. రేపు జయ ఏకాదశి. ఈ పరిహారాలు పాటించడం వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
Jaya ekadashi 2024: ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి.
ఈ ఏడాది జయ ఏకాదశి ఫిబ్రవరి 20న వచ్చింది. విష్ణుమూర్తి ఆశీస్సులు పొందటం కోసం ఏకాదశి నాడు పూజ చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి.
పూజలో లక్ష్మీదేవి, విష్ణువుకి తప్పనిసరిగా తులసి ఆకులు సమర్పించాలి. ఏకాదశి ఉపవాసం ఉంటే జాతకుల కోరికలన్నీ నెరవేరతాయని పురాణాలు చెబుతున్నాయి. జయ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏకాదశి నాడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆరోజు ఆయుష్మాన్ యోగం, త్రి పుష్కర యోగం, ప్రీతి యోగం, రవి యోగం వంటి శుభ కలయిక జరగబోతుంది. అది మాత్రమే కాదు జయ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
జయ ఏకాదశి పరిహారాలు
జయ ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువుకి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వృత్తి, ఉద్యోగ రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ నైపుణ్యాలు ప్రదర్శించేందుకు కొత్త అవకాశాలు తారసపడతాయి.
వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలతో ఆ ఇల్లు నరకంగా మారుతుంది. దంపతులు విడిపోయే పరిస్థితి ఏర్పడితే జయ ఏకాదశి రోజు ఈ పరిహారం పాటించి చూడండి. దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు లేకుండా ఉండాలంటే జయ ఏకాదశి నాడు లక్ష్మీదేవికి, తులసి మాతకి అలంకరణ వస్తువులు సమర్పించండి. మీ సమస్యలు తొలగిపోతాయి.
జయ ఏకాదశి నాడు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలని అధిగమించేందుకు ఈరోజు పేదలు లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా డబ్బు దానం చేయండి. పుణ్య ఫలం దక్కుతుంది.
జయ ఏకాదశి నాడు శ్రీమద్భాగవతం కథని పఠించడం పుణ్యప్రదంగా భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యలతో సత్యమతమవుతుంటే బ్రహ్మ ముహూర్తంలో విష్ణుమూర్తిని భక్తి శ్రద్దలతో పూజించండి.
ఒక తమలపాకు తీసుకుని అందులో ఓం విష్ణువే నమః అని రాసి భగవంతుడి పాదాల వద్ద సమర్పించాలి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు వస్త్రంలో చుట్టి భద్రపరుచుకోవాలి. మీ సేఫ్ లాకర్ లో ఇది పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు.
జయ ఏకాదశి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు.