Bhishma ekadashi: భీష్మ ఏకాదశి రోజున రెండు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్ అవడం ఖాయం-bhishma ekadashi 2024 jaya ekadashi date and shubha muhurtham these zodiac signs get double benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి రోజున రెండు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్ అవడం ఖాయం

Bhishma ekadashi: భీష్మ ఏకాదశి రోజున రెండు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్ అవడం ఖాయం

Gunti Soundarya HT Telugu
Feb 17, 2024 12:38 PM IST

Bhishma ekadashi 2024: జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు రెండు శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారు.

జయ ఏకాదశి ఫలితాలు
జయ ఏకాదశి ఫలితాలు

Bhishma ekadashi 2024: హిందూ మతంలో ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది జయ ఏకాదశిని ఫిబ్రవరి 20 న జరుపుకుంటారు.

ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. జయ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.

జయ ఏకాదశి శుభ ముహూర్తం

ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 8.50 గంటల నుంచి

ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 20, ఉదయం 9.56 గంటల వరకు ఉంటుంది.

జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి జయ ఏకాదశి అనేక శుభకార్యాలలో జరుపుకోనున్నారు. జయ ఏకాదశి నాడు ప్రీతి యోగం, ఆరుద్ర నక్షత్రం, ఆయుష్మాన్ యోగం వంటివి ఏర్పడుతున్నాయని పంచాంగం చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఫిబ్రవరి 20 న గ్రహాల రాకుమారుడు బుధుడు శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుభ యోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది.

మేషం

మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది.

వృషభ రాశి

భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. ధన ప్రవాహానికి మార్గాలు సుగమం అవుతాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు.

సింహం

మిత్రుల సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కెరీర్ లో అపారమైన విజయాలు మీ సొంతం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

తులా రాశి

కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. gun

ధనుస్సు రాశి

ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం. గత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. ఆదాయాన్నిప పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధికి మార్గం సులభమవుతుంది.

Whats_app_banner