anxiety: ఆందోళన, యాంగ్జైటీని పెంచే ఆలోచనా విధానాలు ఇవే..; వాటికి దూరంగా ఉండండి
‘మనం ఏం ఆలోచిస్తామో.. అదే మనం’ అని అంటుంటారు. మన ఆలోచనల్లోనే మన మానసిక ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. సానుకూల ఆలోచనలలో శాంతి, విజయం, ప్రశాంతత లభిస్తే, ప్రతికూల ఆలోచనలతో భయం, అశాంతి, యాంగ్జైటీ, ఫెయిల్యూర్ వంటివి లభిస్తాయి. అందువల్ల బీ పాజిటివ్..
(1 / 5)
కొన్ని ఆలోచనా విధానాలతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. మన ఆలోచనలతోనే మన భావోద్వేగాలు ముడివడి ఉంటాయి. ఒక భావోద్వేగం లేదా ప్రవర్తనను మార్చడానికి, సంబంధిత ఆలోచనను కూడా మార్చాల్సి ఉంటుంది అని మనస్తత్వవేత్త కరోలిన్ రూబెన్ స్టీన్ రాశారు.
(Unsplash)(2 / 5)
కొన్ని సమస్యలను అతిగా అంచనా వేస్తాం, లేదా.. చాలా తక్కువగా అంచనా వేస్తాం. రెండూ సరైనవి కావు. సమస్యమూలాలపై పరిశీలన, అధ్యయనం జరిపి పరిష్కార మార్గాలను సహేతుకంగా నిర్ణయించుకోవాలి.
(Unsplash)(3 / 5)
సాధారణంగా యాంగ్జైటీ, లేదా ఆందోళన రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మితిమీరిన ఆందోళన, భయం మనస్సులోకి చొచ్చుకుపోతుంది. రాత్రి సమయంలో ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతామనే విషయంలో సైకాలజిస్ట్ అవి సాండర్స్ కొన్ని కారణాలను పంచుకున్నారు.
(Unsplash)(4 / 5)
మ్యాజికల్ థింకింగ్: ఇది ఓసిడిలో ఒక రకం, ఇక్కడ ఒక వ్యక్తి ఏదైనా ఆలోచిస్తే, అదే వారి నిజ జీవితంలో కూడా జరుగుతుందని వారు నమ్ముతారు. దాంతో, ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు ఎక్కువ ఆందోళన చెందుతారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు