Hanuman chalisa: హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్నీ సమస్యలు దూరం-daily chanting these five powerful shlokas in hanuman chalisa to overcome problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్నీ సమస్యలు దూరం

Hanuman chalisa: హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్నీ సమస్యలు దూరం

Gunti Soundarya HT Telugu
Jun 11, 2024 11:03 AM IST

Hanuman chalisa: ఆంజనేయస్వామిని కీర్తిస్తూ రాసినది హనుమాన్ చాలీసా. ఇందులోని శక్తివంతమైన ఐదు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీ జీవితంలోని సమస్యలు, భయాలు అన్నీ దూరమవుతాయి.

హనుమాన్ చాలీసాలోని శక్తివంతమైన శ్లోకాలు
హనుమాన్ చాలీసాలోని శక్తివంతమైన శ్లోకాలు

Hanuman chalisa: మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. కలియుగంలో ఇప్పటికి సజీవుడుగా ఉన్న దేవుడిగా హనుమంతుడిని కొలుస్తారు. హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం సులభమైన మార్గం.

తులసీదాస్ రచించిన ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉన్నాయి. భయాన్ని వదిలి ధైర్యాన్ని తెచ్చుకునేందుకు, ఆటంకాలను సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందేందుకు హనుమాన్ చాలీసాలోని కొన్ని దోహాలు పఠించడం వల్ల భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే నిరంతర సవాళ్లను అధిగమించగలుగుతారు. శక్తివంతమైన ఐదు శ్లోకాలు ఏమిటో తెలుసుకుందాం.

1. నాసే రోగ్ హరే సబ్ పీడా

జపత్ నిరంతర హనుమత్ బీరా

మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే మీరు ఈ దోహాన్ని రోజుకి 108 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. ప్రతి మంగళవారం హనుమంతుడి విగ్రహం ముందు కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.

2. విద్యావాన్ గుని అతి చతుర్

రామ్ కాజ్ కరీబే కో ఆతుర్

హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు జ్ఞానం, తెలివితేటలు, డబ్బు సంపాదించేందుకు మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపించాలి. దీన్ని 108 సార్లు పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

3. భూత్ పిసాచ్ నికత్ నహీ ఆవే

మహాబీర్ జబ్ నామ్ సునవే

భయం, ప్రతికూల శక్తులను దూరం చేసేందుకు ఈ శ్లోకాన్ని రోజుకి 108 సార్లు ఉదయం పూట పఠించాలి. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజలు వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపిస్తే వాటి నుంచి విముక్తి కలుగుతుంది.

4. అష్ట్ సిద్ధి నవ్ నిధి కే దాతా

వర్ దీన్ జాంకీ మాతగా

సీతాదేవి ఆశీర్వాదంతో హనుమంతుడు అష్టసిద్ధులు, తొమ్మిది నిధులను పొందాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 30 నుంచి 60 నిమిషాల పాటు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది.

5. భీమ రూప్ ధరి అసుర్ సంఘారే

రామచంద్ర కే కాజ్ సవారే

విరోధులు, శత్రువులను వ్యవహరించడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించాలి. అలాగే ఏవైనా పనులు పూర్తి చేయడంలో మీరు ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీ సమస్యలు అన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది.

హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. హనుమంతుడి దీవెనలు పూర్తిస్థాయిలో పొందాలంటే ఈ తప్పులు చేయకుండా హనుమాన్ చాలీసా పఠించాలి.

మొదటగా మీరు హనుమాన్ చాలీసా జపించడం ప్రారంభించిన తర్వాత అంతరాయం లేకుండా నిరంతరంగా చదవాలి. ఆధ్యాత్మిక శక్తి పొందేందుకు 21 లేదా 40 రోజుల పాటు వరుసగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

హనుమాన్ చాలీసా పఠించాలని అనుకున్నప్పుడు మద్యం, మాంసాహారం తీసుకోకుండా ఉండాలి. క్రమశిక్షణగా మెలగాలి. అప్పుడు ఆధ్యాత్మిక అనుభవం మెరుగుపడుతుంది.

హనుమాన్ చాలీసాను హడావుడిగా చదవకుండా నెమ్మదిగా మనస్పూర్తిగా దృష్టి మొత్తం దేవుడి మీద లగ్నం చేసి పారాయణం చేయాలి.

హనుమాన్ చాలీసాలో పఠించేనదుకు అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని ప్రారంభించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో శ్లోకాలను పఠించడం వల్ల దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయి. మీరు దైవికంతో మమేకం కాగలుగుతారు.

WhatsApp channel