Lord hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎప్పుడు ధనానికి కొదువ ఉండదు-these zodiac signs are lord hanuman favorite they could never face financial problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎప్పుడు ధనానికి కొదువ ఉండదు

Lord hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎప్పుడు ధనానికి కొదువ ఉండదు

Gunti Soundarya HT Telugu
May 28, 2024 09:42 AM IST

Lord hanuman: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాశులలో కొన్నింటికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆయనకు ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. వారికి ఎప్పుడూ ధనానికి కొదువ ఉండదు.

హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే
హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే (pixabay)

Lord hanuman: హనుమంతుని అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని కోరికల నెరవేరుతాయి. హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేస్తారు. అలా మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. 

yearly horoscope entry point

ఈరోజు బజరంగ బలిని పూజించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఉపవాసం పాటిస్తారు. జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం హనుమంతుడికి కొన్ని రాశులపై ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ రాశుల వారికి ఆంజనేయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అవి ఏవో తెలుసుకుందాం. 

మేష రాశి

హనుమంతుడికి ప్రీతికరమైన వాటిలో మొదటి రాశి మేష రాశి .వీరికి బజరంగబలి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి. వీరికి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఎక్కువ రోజులు వీరిని కష్టాలు అంటిపెట్టుకొని ఉండవు. మంగళవారం హనుమంతుడిని ఆరాధించడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. 

సింహ రాశి

హనుమంతుడికి ఇష్టమైన రాశులలో రెండవది సింహ రాశి. వీరికి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంది. ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఏ పని చేపట్టిన అందులో త్వరగా విజయం సాధిస్తారు .ధనానికి కూడా కొదువ ఉండదు. మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాలం నిలువలేవు. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఆంజనేయుడి ప్రత్యేక కృప ఉంటుంది. అందువల్ల ఇబ్బందులకు చాలావరకు దూరంగానే ఉంటారు. ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం కూడా బలంగా ఉంటుంది. హనుమంతుడి అనుగ్రహంతో వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. మంగళవారం బజరంగబలిని పూజించడం ద్వారా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. మీ కోరికలు నిస్వార్ధంగా ఉంటే హనుమంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. 

కుంభ రాశి

శని సొంత రాశి అయిన కుంభ రాశి కూడా హనుమంతుడికి ఇష్టమైన రాశి. అందుకే వీరికి ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటాయి. హనుమంతుడి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ రాశి వారి పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆంజనేయుడి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మంగళవారం నాడు బజరంగ్ బాన్ పఠించడం వల్ల కుంభ రాశి వారికి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. 

మంగళవారం పరిహారాలు 

మరికొద్ది రోజుల్లో హనుమంతుడికి ఇష్టమైన బడా మంగళ్ రాబోతుంది. ఈ సమయంలో హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి.  శని దుష్ప్రభావాలతో బాధపడే వాళ్ళు మంగళవారం నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. 

ఈ సమయంలో కుంభం, మకరం, మీన రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కర్కాటకం, వృశ్చికంపై శని దయ్యా కొనసాగుతున్నాయి. మంగళవారం 7 లేదా 11సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. అలాగే 7 లేదా 11 మంగళవారాలు పాటు శనీశ్వరుడు ఆశీస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించవచ్చు. ఇలా చేసినా కూడా శని దోషం నుంచి బయటపడవచ్చు. 

మంగళవారం నాడు హనుమంతుడికి అరటిపండు, శనగపిండి లేదా బూందీ లడ్డు సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తుల ధరించడం చాలా శుభదాయకం. హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎరుపుగా భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు గులాబీ పూలు, మాలను స్వామి వారికి సమర్పించాలి. కుంకుమలో మల్లె నూనె కలిపి స్వామివారికి సమర్పించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఓం హను హను హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించాలి. 

 

Whats_app_banner