Mars transit: మేష రాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి ముందుంది మంచి కాలం, జీవితమే మారబోతుంది
Mars transit: మేష రాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశుల వారికి ముందుంది మంచి కాలం. అంగారకుడి అనుగ్రహంతో వీరి జీవితమే మారబోతుంది.

Mars transit: జూన్ 1వ తేదీ నుంచి కుజుడు మీన నుంచి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతి అంటారు. శక్తి, సోదరుడు, భూమి, ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి అంగారకుడు ప్రతీతి.
కుజుడు మేషం, వృశ్చిక రాశికి అధిపతి. మకర రాశిలో ఎక్కువగా ఉంటుంది. అయితే కర్కాటకం కుజుడికి బలహీన రాశి. కుజుడు మేష రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఖాయం. ఈ రాశుల వారికి జూన్ 1 తరువాత నుంచి చాలా శుభదాయకంగా ఉంటుంది. మేషరాశిలో కుజుడి ప్రవేశంతో ఏయే రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయో చూద్దాం.
మేష రాశి
కుజుడు మేష రాశిలోనే సంచరించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం మాధుర్యంగా ఉంటుంది. పిల్లలు శుభవార్తలు అందిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయం మీకు విజయాలతో నిండి ఉంటుంది. కార్యాలయంలో కొత్త పద్ధతులు పొందుతారు. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు లభిస్తాయి. తోటి వారి సహాయంతో క్లిష్ణమైన పనులు కూడా చేయగలుగుతారు. వ్యాపారులకు పాత పెట్టబడులతో మంచి రాబడి లభిస్తుంది. వృత్తిలో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ గౌరవం చాలా పెరుగుతుంది.
మిథున రాశి
కుజుడి అనుగ్రహం మిథున రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులపై పనులు ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగం చేసే ప్రదేశంలో, వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో పని చేస్తే వ్యాపారంలో లాభదాయక అవకాశాలు కలుగుతాయి. బిజినెస్ పనిమీద వేరే దేశాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు రాశి
ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. సామాజిక సేవలో నిమిత్తమై పలు కార్యక్రమాలలో మీ వంతు ప్రయత్నాలు కృషి చేస్తారు. కుటుంబంలో ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. సహోద్యోగుల సహకారంతో కార్యాలయంలో అనేక పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అధికారులు అండగా నిలుస్తారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. పాజిటివ్ ఎనర్జీతో పనులు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించాలి.
మేషరాశిలో సంచరిస్తాడు జులై 12 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు