Mars saturn conjunction: శని కుజుడి కలయిక.. 52 రోజుల పాటు ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతుంది
Mars saturn conjunction: శని, కుజ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. దీని ఫలితం ఏయే రాశుల మీద పడుతుందో తెలుసుకుందాం.
Mars saturn conjunction: గ్రహ సంచార పరంగా జూన్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో పెద్ద గ్రహాలైన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, శని తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఇది మేష రాశి నుంచి మీన రాశి వరకు శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది.
జూన్ 1 శనివారం గ్రహాల అధిపతి అయిన కుజుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 12 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. జూన్ 29న శని కుంభ రాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తాడు. నవంబర్ 15 వరకు తిరోగమన స్థితిలోనే శని ఉంటాడు. అలాగే మేష రాశిపై శని ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని గృహాలలో శని కుజుడి కలయిక జరుగుతుంది.
జ్యోతిష్య లెక్కల ప్రకారం కుజుడు శని కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సవాళ్లు తీసుకొస్తుంది. 52 రోజులు పాటు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక అలసడి ఏర్పడుతుంది. ఏయే రాశుల వారికి శని, కుజ గ్రహాలు కష్టాలు పెంచుతారో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కుజ, శని కలయిక కర్కాటక రాశి వారి జీవితంలో సవాళ్లను పెంచుతుంది. ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. తెలియని వాటికి భయపడి మనసు కలత చెందుతుంది.
కన్యా రాశి
జూన్ నెలలో కన్యా రాశి వారికి కష్టాలు అధికమవుతాయి. శని కుజ గ్రహాల కలయిక వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో నష్టాన్ని భరించవలసి ఉంటుంది. ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే సంబంధాల్లో విభేదాలు రావచ్చు.
తులా రాశి
కుజ, శని అశుభ ప్రభావాలతో తులా రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి .ఈ సమయంలో వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. మీ ఇమేజ్ ని ఎవరైనా దెబ్బతీయవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ధన నష్టం సంభవించవచ్చు.
వృశ్చిక రాశి
జూన్ మాసం నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు అధికమవుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్థిక విషయాలలో ఎవరిని అతిగా నమ్మవద్దు. లేదంటే ధనం నష్టపోవాల్సి వస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ నాలుగు రాశుల జాతకులు 52 రోజులు పాటు అప్రమత్తంగా ఉంటే జీవితం సానుకూలంగా సాగిపోతుంది.