Mangala sutram: మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేస్తారో తెలుసా?-do you know why black beads are worn in mangalsutra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mangala Sutram: మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేస్తారో తెలుసా?

Mangala sutram: మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేస్తారో తెలుసా?

Gunti Soundarya HT Telugu
May 13, 2024 12:00 PM IST

Mangala sutram: మంగళసూత్రంలో తప్పనిసరిగా ఎరుపుతో పాటు నలుపు రంగు పూసలు వేసుకుంటారు. అవి కూడా లెక్క ప్రకారమే వేస్తారు. అయితే నలుపు అశుభం అంటారు కదా మరి మంగళసూత్రంలో ఎందుకు వేసుకుంటారో తెలుసా?

మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేస్తారు?
మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేస్తారు? (pinterest)

Mangala sutram: సనాతన ధర్మంలో రంగుచాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతి రంగు దాని ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే నలుపు రంగు మాత్రం అశుభానికి సంకేతంగా భావిస్తారు. 

శుభకార్యాలు, పండుగలు, వివాహాలు, పూజలు వంటి మతపరమైన ఆచారాలకు నలుపు రంగు వస్త్రాలు ధరించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లిలో వధువు ధరించే మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు తప్పనిసరిగా ఉంటాయి. 

మంగళ సూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు ఉంటాయని విషయం చాలామందికి తెలియదు. పెళ్లయిన ప్రతి స్త్రీ మంగళ సూత్రంతో పాటు నల్లపూసల గొలుసు కూడా వేసుకుంటుంది. హిందూ మతం ప్రకారం దేవుళ్ళు స్వయంగా నలుపు రంగును అత్యున్నత రంగుగా పిలుస్తారు. సంపదకు దీన్ని చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు మీ స్థితిని, మీ బలాన్ని చూపిస్తుంది. నలుపు రంగు శని దేవుడికి ఇష్టమైనది. ఈ రంగు స్వభావం ఎవరి పట్ల వివక్షత లేదని చూపిస్తుంది. అందుకే జడ్జీలు, లాయర్లు కూడా నలుపు రంగు కోటు వేసుకుంటారు. 

నలుపు రంగు నిజంగా అశుభమా?

దుర్గామాత తొమ్మిది రూపాలలో ఏడవ రూపం మహాకాళి చాలా శక్తివంతమైనది. ఆమె కోపాన్ని చల్లార్చడానికి స్వయంగా శివుడు ఆమె పాదాల దగ్గరకు రావాల్సి వచ్చిందని అంటారు. విష్ణు రూపమైన సాలిగ్రామం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి కలిగిస్తుంది. అలాగే గ్రంధాలలో కూడా నలుపు రంగు గురించి ప్రస్తావించారు. నలుపు రంగు ఆవుల్ని పూజిస్తే ఉత్తమంగా ప్రకటిస్తారు. శని, కేతువు ప్రతికూల పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నల్ల కుక్కకు రొట్టె తినిపించాలని పెద్దలు చెబుతారు. అలాగే ప్రజలు నిత్యం అభిషేకం చేసే శివలింగం కూడా నలుపు రంగులోనే ఉంటుంది.

శగుణ శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు రావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంటికి సంపద, శ్రేయస్సుని తీసుకొస్తుందని నమ్ముతారు. నలుపు రంగు చాలా శక్తివంతమైనది. చెడు దృష్టిని వదిలించుకోవడానికి తమ శరీరాలపై చాలామంది శని ఆలయం లేదా భైరవ ఆలయం నుంచి తెచ్చుకున్న నల్లదారాన్ని ధరిస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా నలుపు రంగు గురించి ప్రస్తావించారు. 

మంగళ సూత్రంలో నలుపురంగు ఎందుకు వేస్తారు?

మంగళ సూత్రంలోని పూసలు కూడా నలుపు రంగులో ఉంటాయి. దీని వెనుక కారణం ఏమిటంటే భార్యాభర్తల మధ్య సంబంధం ఏడు జన్మల పాటు కొనసాగుతుంది. ఈ జంట మీద ఏ చెడు దృష్టి, శత్రువుల దృష్టి పడకుండా ఉండేందుకు నలుపు రంగు పూసలు మంగళసూత్రంలో వేస్తారు. ఇవి ధరించడం అంటే ఆశీర్వాదం, రక్షణ, దీర్ఘాయువు ప్రసాదించడానికి చిహ్నంగా వీటిని ధరిస్తారు. 

వీళ్ళు నలుపు వేసుకోకూడదు

ఎవరి జాతకంలో అయితే శని అత్యల్ప స్థితిలో ఉండి బాధలు అనుభవిస్తారో వాళ్ళు నలుపు రంగు ఉపయోగించకూడదు. శనికి మేష రాశి అత్యల్ప రాశిగా పరిగణిస్తారు. 

న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీలో 8వ సంఖ్య ఎక్కువగా కనిపిస్తే నలుపు రంగుకు దూరంగా ఉండాలి. శని వల్ల బాధలు ఎక్కువగా పడుతున్న వాళ్ళు ఈ రంగు ఉపయోగించకూడదు. 

 

టాపిక్