చైత్ర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏ పూజలు చేస్తే సత్ఫలితాలు దక్కుతాయంటే..-chaitra purnima 2024 date puja vidhi auspicious time bathing and more details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  చైత్ర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏ పూజలు చేస్తే సత్ఫలితాలు దక్కుతాయంటే..

చైత్ర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏ పూజలు చేస్తే సత్ఫలితాలు దక్కుతాయంటే..

Apr 17, 2024, 08:23 AM IST Chatakonda Krishna Prakash
Apr 17, 2024, 08:23 AM , IST

Chaitra Purnima in 2024: సాధారణంగా అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి. అయితే, అందులో చైత్ర పౌర్ణమికి మరింత ఎక్కువ విశిష్టత ఉంటుంది. అదే రోజున హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటాం. ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏ తేదీన వచ్చింది? ఆ రోజు ఏ పూజలు చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకోండి. 

సనాతన ధర్మంలో పౌర్ణమి తిథిని అత్యంత పవిత్రంగా, విశేషంగా భావిస్తారు. సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి పౌర్ణమి ప్రీతికరమైన రోజుగా విశ్వసిస్తారు. అయితే, సంవత్సరంలో 12 పౌర్ణమిలు ఉన్నా.. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత, విశిష్టత ఉంటాయి. 

(1 / 8)

హిందూ నూతన సంవత్సరంలో చైత్ర పౌర్ణమి.. తొలి పౌర్ణమిగా వస్తుంది. అదే రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 చైత్ర పౌర్ణమి తేదీ, సమయం, ఏ పూజలు చేయాలో తెలుసుకుందాం. 

(2 / 8)

ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం చైత్ర పౌర్ణమి వచ్చింది. అదే రోజున హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలి. చైత్ర పౌర్ణమి రోజున శ్రీవిష్ణువును సత్యనారాయణ స్వామి రూపంలో పూజించాలి. సత్యనారాయణ స్వామి కథలను వినాలి. ఉపవాసం కూడా పాటించాలి. రాత్రి లక్ష్మిదేవి పూజ చేయాలి. 

(3 / 8)

పంచాగం ప్రకారం ఈ ఏడాది చైత్ర మాస పౌర్ణమి ఏప్రిల్ 23వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 26 నిమిషాలకు ప్రారంభమై.. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 5 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. అందుకే చైత్ర పౌర్ణిమను ఏప్రిల్ 23వ తేదీ నిర్వహించుకోవాలి. 

(4 / 8)

చైత్ర పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 4 నిమిషాల మధ్య స్నానం చేయాలి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:58 గంటల మధ్య హనుమంతుడి పూజ చేయాలి. చంద్రోదయ సమయం 6:25 గంటలకు ఉంటుంది. రాత్రి 11:27 గంటల నుంచి 12:41 మధ్య లక్ష్మిపూజ చేస్తే మంచిది. 

(5 / 8)

వానర రాజు కేసరి, తల్లి అంజనీకి చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు. చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి. ఆ రోజున హనుమాన్ చాలీసా, సుందరాకాండ, రామాయణ పారాయణం చేసే వారిని హనుమంతుడు ఆపదల నుంచి రక్షిస్తాడని, జీవితంలో సంతోషం దక్కుతుందని నమ్ముతారు. 

(6 / 8)

పురాణాల ప్రకారం, చైత్ర పౌర్ణమి రోజున శ్రీకృష్ణుడు.. రాస్ ఉత్సవాన్ని నిర్వహించాడని నమ్ముతారు. ఆ ఉత్సవంలో వేలాది మంది గోపికలు పాల్గొనగా.. శ్రీకృష్ణుడు నృత్యం చేశాడు. 

(7 / 8)

చైత్ర పౌర్ణమి రోజున తీర్థయాత్రలకు, ఆలయాలకు వెళ్లడం, నదీ స్నానం చేయడం, దానం చేయడం చాలా పుణ్యాన్ని ఇస్తుంది. 

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు