Sakat chaut: పిల్లల దీర్ఘాయువు కోసం సకత్ చౌత్ వ్రతం.. ఎప్పుడు చేయాలి? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి?-when is sakat chaut vratam date and time what is the importance of sakat chaut vratam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sakat Chaut: పిల్లల దీర్ఘాయువు కోసం సకత్ చౌత్ వ్రతం.. ఎప్పుడు చేయాలి? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి?

Sakat chaut: పిల్లల దీర్ఘాయువు కోసం సకత్ చౌత్ వ్రతం.. ఎప్పుడు చేయాలి? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jan 24, 2024 05:35 PM IST

Sakat chaut: తమ బిడ్డల క్షేమం కోరుతూ తల్లులు సకత్ చౌత్ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలంటే..

సకత్ చౌత్ ఎప్పుడు వచ్చిందంటే
సకత్ చౌత్ ఎప్పుడు వచ్చిందంటే (pixabay)

Sakat chaut: తమ పిల్లలు దీర్ఘాయువుతో ఎటువంటి కష్టాలు లేకుండా చేయమని కోరుతూ తల్లిదండ్రులు సకత్ చౌత్ వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది సకత్ చౌత్ జనవరి 29న వచ్చింది. ఈరోజు తల్లిదండ్రులు ఉపవాసం ఉండి విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఉపవాసం వినాయకుడికి అంకితం చేయబడింది. సకత్ చౌత్ ని సంకష్ట చతుర్థి, తిల్కుత్, మాఘ చతుర్థి అని కూడా పిలుస్తారు.

ఈ ఉపవాసంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. సకత్ చౌత్ ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షం నాలుగవ రోజు జరుపుకుంటారు. ఈ ఉపవసాన్ని ఆచరించడం వల్ల పిల్లలు ఆరోగ్యకరమైన ఆయుష్హుని పొందుతారు. ఆనందంగా జీవిస్తారు. అందుకే ఈ పండుగ రోజు తల్లులు తమ పిల్లల దీర్ఘాయువు కోసం, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల పిల్లలకి వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

సకత్ చౌత్ ముహూర్తం

చతుర్థి తిథి ప్రారంభం జనవరి 29,2024 ఉదయం 06.10 గంటలకి

చతుర్థి తిథి ముగింపు జనవరి 30, 204 ఉదయం 08.54 గంటలకి. చంద్రోదయ సమయం రాత్రి 9.10 గంటలకి ప్రాంతాలని బట్టి ఈ సమయం మారవచ్చు.

పూజా విధానం

సకత్ చౌత్ రోజు తప్పనిసరిగా వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే ఇది వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. తర్వాత వినాయకుడిని పూజించాలి. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వినాయకుడి విగ్రహం దగ్గర కలశంలో నీటిని ఉంచాలి. ఇక ధూప దీప, నైవేద్యాలు, నువ్వుల, లడ్డు, చిలగడదుంప, జామ కాయలు, బెల్లం, నెయ్యి వంటివి నైవేద్యంగా సమర్పించాలి.

పూజ చేసేటప్పుడు వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు గణేష్ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. సాయంత్రం వేళ పూజ అయిపోయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. అందులో నువ్వులు, ఎర్రటి పూలు తప్పనిసరిగా వేయాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేందుకు పాలు, గంగాజలం ఉంటే మంచిది.

సకత్ చౌత్ పూజలో తమలపాకు తప్పనిసరి

గణేశుడు పూజలో తమలపాకు ఉపయోగించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే ఇష్టమని నమ్ముతారు. అందుకే సకత్ చౌత్ పూజలో తప్పనిసరిగా తమలపాకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి, వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి.

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. గణేషుడికి ఇష్టమైన పువ్వులు, దుర్వా, లడ్డూలు పెట్టాలి. అడ్డంకులు తొలగించాలని కోరుకుంటూ ఓం గణపతి నమః అనే మంత్రాన్ని జపించాలి. బిడ్డ దీర్ఘాయువు కోరుతూ సకత్ చౌత్ ఉపవాస కథ వినాలి. రాత్రిపూట చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం పూర్తి చేయాలి. ఈ ఉపవాసం సమయంలో మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు.

Whats_app_banner