Vinayaka Prasadam: వినాయకుడికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే చాలు.. ప్రసన్నమైపోతాడట..
గణేశుడికి కొన్ని ప్రసాదాలు సమర్పిస్తే.. ఆయన ప్రసన్నమై ఆటంకాలు తొలగిస్తారని భావిస్తారు. అయితే ఆ ప్రసాదాలు ఏంటో తెలుసుకుని మీరు కూడా స్వామిని ప్రసన్నం చేసుకోండి.
Vinayaka Chavithi Prasadam List : చాలా మంది భక్తులు వినాయకుడిని బుధవారం పూజిస్తారు. ఇళ్లలోనే గణేషుడికి ప్రత్యేకంగా గణపతి పూజ చేస్తారు. వివిధ వంటకాలతో లంబోధరుడిని ప్రసన్నం చేసుకుంటారు. పైగా వినాయక చవితి 2022 త్వరలోనే రాబోతుంది. అయితే వినాయకుని పూజలో గణేశునికి ఎలాంటి భోగభాగ్యాలు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి బుధవారమే కాకుండా.. వినాయక చవితి పండుగ సమయంలో కూడా ఇవి మీకు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా మీరు గణేషుని ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు.
లడ్డూలు
వినాయకునికి ఇష్టమైన వంటకాలు అంటే గుర్తొచ్చేవి మోదకాలు. అయితే ఇవి మాత్రమే కాదు.. గణేశుడికి లడ్డూ అంటే కూడా ఇష్టమే. కాబట్టి మీరు ప్రతి బుధవారం ఇంట్లో మోదకం చేయలేకపోయినా.. గణేశుడికి మీరు లడ్డూలను సమర్పించవచ్చు.
పాయసం
హిందూ గ్రంధాల ప్రకారం.. వినాయకుడికి.. పార్వతీ దేవి చేసిన పాయసం తినడానికి ఇష్టపడతాడు అంటారు. దీని ప్రకారం.. మీరు ఇంట్లో చేసిన పాయసాన్ని.. గణేషునికి ప్రసాదంగా సమర్పించవచ్చు. పైగా ఏ పూజకైనా, శుభకార్యానికైనా పాయసం చేయడం తెలుగు ప్రజలకు అలవాటే.
అరటి, కొబ్బరి
వినాయకుడు ఎప్పుడూ అరటిపండు ప్రసాదం తినడానికి ఇష్టపడతాడు. కాబట్టి మీరు గణేషునికి సమర్పించే ప్రసాదంలో అరటిపండును చేర్చితే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరికాయ కూడా చాలా శ్రేయస్కరం. కాబట్టి గణేష్ ప్రసాదంలో కొబ్బరికాయను ఉంచడం ఫలప్రదం.
సంబంధిత కథనం