Elianati shani: ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దీని నుంచి బయట పడేందుకు ఏం చేయాలి?
Elianati shani: ఏలినాటి శని అంటే ఏంటి? దీని ప్రభావం ఒక వ్యక్తి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. వాటి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Elianati shani: హిందూ మతంలో శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి కర్మల అనుసారం శుభ ఫలితాలను లేదా ప్రతికూలఫలాలను పొందుతారు. అందుకే శని చాలా శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు.
శని సంచారం వల్ల అన్ని రాశి చక్రాలు ప్రభావితమవుతాయి. శని దేవుడు ఏ రాశిలో ఉన్నాడో దాని ప్రభావాన్ని బట్టి ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. వీటినే సడే సతీ, దయ్యా అని కూడా అంటారు. శని దేవుడు ఏడున్నర సంవత్సరాలు ప్రభావితం చేయడాన్ని ఏలినాటి శనిగా పిలుస్తారు. శని దయ్యా ప్రభావం ఒక వ్యక్తిపై రెండున్నర సంవత్సరాలు ఉంటుంది.
ఏలినాటి శని అంటే ఏంటి?
శని దేవుడు 12వ ఇంట్లో లేదా సొంత రాశిలో సంచరిస్తున్నప్పుడు లేదా ఏదైనా రాశికి చెందిన రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఏలినాటి శని ప్రభావం అంటారు. అది అప్పటి నుంచి ఆ రాశిపై కనిపించడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం మూడు దశలుగా ఉంటుంది. ఈ సమయం మొత్తం 2 1/2 ఏళ్ల చొప్పున మూడు దశలుగా వేరు చేస్తారు. ఇలా మొత్తం దీని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.
అర్థాష్టమ శని అంటే ఏమిటి?
దీనినే శని దయ్యా అని కూడా అంటారు. శని జన్మ రాశి నుంచి నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో కూర్చున్నప్పుడు వారి మీద అర్థాష్టమ ప్రభావం ఉంటుంది .ఇది వ్యవధి మొత్తం రెండున్నర సంవత్సరాలు. ఏలినాటి శని, అర్థాష్టమ శని రెండూ ఆశుభం. బాధాకరమైన ఫలితాలను అందిస్తాయి. అయితే అది ఎప్పుడూ అలాగే ఉండదు. జాతకంలో శని స్థానం సడే సతి, దయ్యాపై ప్రభావం చూపుతుంది.
శని చెడు ప్రభావం నుంచి బయట పడటం ఎలా?
ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించడం చాలా మంచిది. శని దేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే .అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. దాని వల్ల సడే సతి, దయ్యా ప్రభావాలు తగ్గించుకోవచ్చు
ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని సమస్యలు తగ్గిపోతాయి
ప్రతి శనివారం శని దేవుడిని పూజించాలి. శని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయడం వల్ల శని చెడు ఫలితాల ప్రభావం తగ్గుతుంది.
శని దేవుడి ఆశీస్సులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులు కొన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు .నల్ల మినపప్పు, నలుపు రంగు వస్త్రాలు, ఆవనూనె, ఇనుము, బెల్లం వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి
ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని పఠించాలి. అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. హనుమంతుడిని ఆరాధించాలి. రావి చెట్టు కింద శనివారం ఆవనూనెతో దీపం వెలిగించి శని దేవుడిని ప్రార్థించాలి.
ఏలినాటి శని ప్రభావం తగ్గిపోవాలని అనుకున్నట్లయితే మీరు శనివారం పూట పొరపాటున కూడా ఇనుము వస్తువులు కొనుగోలు చేయరాదు. ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కష్టజీవులకు ఎటువంటి సహాయం చేసిన శని ఆశీస్సులు లభిస్తాయి. చీమలకు పిండిలో పంచదార వేసి వేయడం వల్ల కూడా శని ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం నుంచే విముక్తి కలుగుతుంది.