Sita ki Rasoi: ఈ ఆలయమే సీతాదేవి వంట చేసిన పవిత్రమైన వంటగది, ఎక్కడుందో తెలుసా?
Sita ki Rasoi: హిందువులకు శ్రీరామ చరితం పరమ పవిత్రమైనది. సీతాదేవి మహోన్నతమైన స్త్రీ మూర్తి. సీతాదేవి విశేషాలు ఎల్లప్పుడూ

Sita ki Rasoi: రామాయణం... హిందువులకు పరమ పవిత్ర గ్రంథం. సీతా దేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా నమ్ముతారు. శ్రీరాముడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. అలాంటి శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి. జానకి, వైదేహి, మైథిలి ఇలా సీతాదేవికి ఎన్నో పేర్లు. బతుకైనా, చావైనా భర్తతోనే అని వనవాసాన్ని ఆనందంగా అనుభవించిన మహా మాత సీతాదేవి. భర్త రాముడు, అత్తలు వారించినా కూడా భర్తతోనే అడవులకు నడిచింది. అడవిలో గడ్డిపై పడుకున్నా... అది తనకు హంసతూలికా తల్పంతో సమానమని భావించి మరీ వనవాస దీక్షను సాగింది. వనవాస సమయానికి సీతకు కేవలం 18 ఏళ్లుగా చెప్పుకుంటారు. ఆమెను ఇప్పటి మహిళలకు ఆదర్శం. సీతాదేవికి చెందిన ఎన్నో విశేషాలు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి అయోధ్యలోని సీతా కి రసోయి.
సీత కి రసోయి అంటే సీతాదేవి వంట చేసిన గది అని అర్థం. అది తర్వాత కాలంలో ఆలయంగా మారిపోయింది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి సీతాదేవిని కొలిచి వెళుతూ ఉంటారు. ఒకప్పుడు వంటగదిగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు గొప్ప ఆలయంగా రూపాంతరం చెందడానికి సీతాదేవి గుణగణాలే కారణం. ఆమె కుటుంబాన్ని పోషించే ఉత్తమ ఇల్లాలుగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో కొన్ని అవశేషాలు, కళాఖండాలు కూడా ఉన్నాయి. వాటికి భక్తులు నివాళులు అర్పిస్తారు.
సీతాదేవిని అన్నపూర్ణాదేవిగా కూడా పిలుచుకుంటారు. జీవనోపాధి, పోషణను అందించమని సీతను ప్రార్థిస్తారు భక్తులు. ఆలయంలో ఉచిత ఆహారాన్ని అందించే కార్యక్రమం సాగుతోంది. అనేక స్థానిక ఇతిహాసాలు, నమ్మకాల ప్రకారం ఈ వంట గదిలో సీత స్వయంగా వండి అందరికీ వడ్డించిందని అంటారు. తను కూడా ఇదే స్థలంలో భోజనం చేసిందని చెబుతారు. అందుకే ఇది ఆధ్యాత్మిక ప్రదేశంగా మారిపోయిందని అంటారు.
అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు ఈ సీత కి రసోయి ప్రాంతాన్ని కూడా దర్శించుకుంటారు. ఇదే వంటశాలలో ఐదుగురు రుషులకు సీతామాత భోజనం పెట్టిందని... దానివల్లే ఆమె అన్నపూర్ణా మాతగా మారిందని కథలు వినిపిస్తున్నాయి. సీతాదేవి ఈ వంటగదిలో కఢీ, మల్పువా, పాయసం వంటి వంటకాలు వడ్డించే వారని నమ్ముతారు. ఈ వంట గదికి పక్కనే జానకి కుంఢ్ ఉంది. వంట చేయడానికి ముందు సీతాదేవి ఇదే చెరువులో స్నానం చేసేదని చెప్పుకుంటారు.
టాపిక్