కార్తీక పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే-kartik purnima vrat on 15th november in the auspicious occasion of bharani nakshatra bathing in ganga gives the fruits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కార్తీక పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

కార్తీక పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Gunti Soundarya HT Telugu
Nov 14, 2024 07:42 PM IST

కార్తీక పౌర్ణమి రోజు చేసే గంగా నది స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. గంగా నదీ స్నానం ఆచరించేందుకు ఉత్తమ సమయం ఏదో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి గంగా నది స్నాన ప్రాముఖ్యత
కార్తీక పౌర్ణమి గంగా నది స్నాన ప్రాముఖ్యత

కార్తీక శుక్ల పూర్ణిమ నవంబర్ 15న భరణి నక్షత్రంతో కలిసి జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిలో కార్తీక పూర్ణిమకు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ నవంబర్ 15న తెల్లవారుజామున 3.04 గంటలకు ప్రారంభమై నవంబర్ 16న తెల్లవారుజామున 01.06 మధ్య వస్తుంది. మీరు కార్తీక పూర్ణిమ రోజున తెల్లవారుజామున 3.04 నుండి రోజంతా స్నానం చేయవచ్చు.

పూర్ణిమ వ్రతం పాటించే భక్తులు నవంబర్ 16న ఉపవాస దీక్ష విరమిస్తారు. దేవతల దీపావళి కూడా నవంబర్ 15 సాయంత్రం జరుపుకుంటారు. గ్రంధాలలో మూడు దీపావళి ప్రస్తావన ఉందని జ్యోతిష్యులు తెలిపారు. పితృ దీపావళిని ఆశ్వయుజ అమావాస్య, మానవ దీపావళి కార్తీక అమావాస్య, దేవతల దీపావళిని కార్తీక పూర్ణిమ నాడు జరుపుకుంటారు.

కార్తీక పౌర్ణమి స్నాన ప్రాముఖ్యత

పౌర్ణమి రోజున, మతపరమైన కార్యక్రమాలు, పవిత్ర నదిలో స్నానం, పూజలు, దానధర్మాలు చేస్తారు. దానం చేయడం వల్ల భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారు. కార్తీక పూర్ణిమ నాడు ఏ పని తలపెట్టిన శ్రీమహావిష్ణువు అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల పాపాలు నశించి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కార్తీక పూర్ణిమ రోజున నారాయణుడు మత్స్యావతారంగా తన మొదటి అవతారం ఎత్తినట్టు చెప్తారు. పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువు దగ్గర దీపాన్ని వెలిగించడం లేదంటే దీపం దానం చేయడం వల్ల దివ్య తేజస్సు లభిస్తుంది. ఇది కాకుండా వ్యక్తి సంపద, కీర్తి ప్రయోజనం కూడా పొందుతాడు. గంగాస్నానం చేసిన తర్వాత దీపదానం చేయడం వల్ల భక్తులు 10 యాగాలకు సమానమైన ఫలితాలను పొందుతారు.

పండితులు తెలిపే దాని ప్రకారం కార్తీక పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం వల్ల ఆనందం, సంపద, శ్రేయస్సు మరియు మానసిక ఆనందం లభిస్తాయని చెప్పారు. కార్తీకమాసంలో ఆ మాసమంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గంగాస్నానం చేస్తారు. పౌర్ణమి స్నానం చేయడం ద్వారా ఈ వ్రతం కూడా పూర్తవుతుంది.

గంగా స్నానం ఆచరించేందుకు నవంబర్ 15 ఉదయం 4.58 గణాల నుంచి 5.51 వరకు మంచి సమయం ఉంటుంది. స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజున సత్యనారాయణ పూజ ముహూర్తం ఉదయం 6.44 నుంచి 10. 45 వరకు ఉంటుంది.

గంగాస్నానం ప్రయోజనాలు

కార్తీక మాసంలోని త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలను పురాణాలలో అతి పుష్కరిణి అంటారు. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో ప్రతిరోజూ స్నానం చేసే వ్యక్తి సూర్యోదయానికి ముందు ఈ మూడు తేదీలలో మాత్రమే స్నానం చేస్తే అతనికి పూర్తి ఫలితాలు లభిస్తాయి. గ్రంధాలలో కార్తీక పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా గంగా స్నానం చేసిన ఫలితం ఉంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner