Nutricook : ఆరోగ్య భారత్ ఆమె లక్ష్యం- ‘న్యూట్రీకుక్’తో కల సాకారం- ఇప్పుడు మీ వంటిల్లు మరింత హెల్తీ!
ఆరోగ్య భారత్ కోసం కృషి చేస్తున్న ఆశా వీఎం.. న్యూట్రీకుక్ అనే సంస్థను స్థాపించారు. ఈ న్యూట్రీకుక్ ప్రాడక్ట్స్తో మీరు ఎలాంటి నీరు లేకుండానే, తక్కువ నూనెతో లేకుండానే వంటలు చేసుకోవచ్చు! న్యూట్రీకుక్ గురించి, ఆశా జర్నీ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
కొవిడ్ అనంతరం చాలా మంది ఆరోగ్యకరమైన జీవితంపై దృష్టిసారించారు. కానీ కొంతమందికి మాత్రం అప్పటికే వారు జీవితంలో పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను, సరైన ఆహరం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మంచి అవకాశం లభించింది. వీరు మంచి ఆహారపు అలవాట్లను తమకు తాము ఆచరించడమే కాకుండా, వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు వీలైనంత వరకు ఆ ప్రయోజనాలను తీసుకురావాలని కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఆశా వీ ఎం ఒకరు! ఆమె సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే ‘న్యూట్రీకుక్’ సంస్థ. ఈ కంపెనీ ప్రాడక్ట్స్తో నీరు, నూనె లేకుండా వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసుకోవచ్చు! సెప్టెంబర్ నెలను ‘నేషనల్ న్యూట్రీషియన్ మంత్’ (జాతీయ పోషకాహర మాసం)గా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆరోగ్య భారత్ కోసం కృషి చేస్తున్న ఆశా, న్యూట్రీకుక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..
సవాళ్లు- అడ్డంకులు- విజయం.. ‘న్యూట్రీకుక్’ ప్రయాణం!
32ఏళ్ల ఆశా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఆమె తల్లి చీరల వ్యాపారం చేస్తుండగా, తండ్రి కాంట్రాక్టర్. ఆయన రుద్రాక్షలు అమ్మే వ్యాపారం కూడా చేసేవారు. నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి ఇండియాలో అమ్మేవారు. ముగ్గురితో కూడిన ఆ కుటుంబానికి జీవితం హాయిగా, సాఫీగా సాగిపోయింది. ఆశా, పదో తరగతి చదువుతుండగా, ఆమె తండ్రి వ్యాపారంలో తీవ్ర నష్టాలను చవిచూశారు. ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యారు. అకస్మాత్తుగా యుక్త వయసులోని ఆశాకు పరిణతి చెందిన బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. ఆమె తనకు తోచిన ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. బీబీఏలో డిగ్రీ పూర్తి చేయడానికి సాయంత్రం కళాశాలలో చేరారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఆమె ఒక జర్మన్ కంపెనీలో జ్యువెలరీ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.
ఆ కంపెనీలో చాలా తక్కువ నూనె, నీరు అవసరమయ్యే వంటసామాను కూడా తయారీ చేస్తుంది. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని ఆ వంట సామానులో వండటం సాధ్యమవుతుంది. ఆశా తన ప్రాథమిక ఉద్యోగమైన ఆభరణాలను విక్రయించడంతోపాటు వంటసామాను కూడా అమ్మడం ప్రారంభించారు. ఉత్పత్తి చాలా బాగున్నప్పటికీ, అది అందరికీ అందుబాటులో లేదని, కంపెనీకి కూడా ఖర్చు తగ్గించడంలో ఆసక్తి లేదని ఆమె తన అనుభవం ద్వారా గ్రహించారు. ఈ ఉత్పత్తి భారతీయ వంటగదికి గొప్ప ప్రయోజనంగా మారుతుందని, మెరుగైన పోషకాహార అలవాట్లకు దోహదపడుతుందని ఆశా గట్టిగా భావించారు. అప్పుడే ఆమె ఈ ఉత్పత్తిని చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయం చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడిని మాత్రమే కాకుండా, కృషి, సమయాన్ని కూడా వెచ్చించాల్సి వస్తుంది. అప్పుడే ఆమె రవి కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయనకు ఇలాంటి కంపెనీలలో 18 సంవత్సరాల పని అనుభవం ఉంది. వీరిద్దరు దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆర్&డీలో నిమగ్నమై, ప్రాడక్ట్‌ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్ స్ఫూర్తితో భారతదేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చేందుకు ఓ అడుగు ముందుకేశారు. తద్వారా బ్రాండ్ "న్యూట్రికుక్" ఆవిర్భవించింది.
ప్రారంభంలో ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఈ ద్వయం అనేక సమస్యలను ఎదుర్కొంది. ముడి పదార్ధాల లభ్యత లేకపోవటం, సరైన సాంకేతికత, మానవశక్తి, యంత్రాలు లేకపోవటం సహా అన్నీ సమస్యలు ఎదురయ్యేవి. ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి వారు అనేక అడ్డంకులను దాటాల్సి వచ్చింది. వాటిలో అతిపెద్దది.. వ్యాపార రుణం పొందడం. పదకొండు కంటే ఎక్కువ బ్యాంకులను ఆశా సంప్రదించారు. దాదాపు రెండు సంవత్సరాలు తన సమయాన్ని వెచ్చించారు. కానీ ఆమెకు వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. అన్ని బ్యాంకులు తాకట్టు పెట్టాలని పట్టుబట్టాయి. ఆమె వద్ద తాకట్టు పెట్టడానికి ఏం లేదు.
ఆశా ఒక స్నేహితురాలి నుంచి బీవైఎస్టీ (భారతీయ యువశక్తి ట్రస్ట్) గురించి తెలుసుకున్నప్పుడు, ఆమె తన కలను సాకారం చేసుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించారు. ఆమె సహాయం కోసం బీవైఎస్టీని సంప్రదించింది, మరింత విశ్వాసం పొందడానికి ఆన్‌లైన్ సెషన్‌లకు హాజరయ్యారు. ఆమె వ్యాపార ప్రతిపాదనను రూపొందించారు. ఆన్‌లైన్ శిక్షణల ద్వారా, ఆమెకు ఇంతకు ముందు తెలియని వివిధ ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకున్నారు. వివిధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత, ఆమె వ్యాపార రుణం మొత్తం 20 లక్షలను ఎస్బీఐ ద్వారా పొందింది. అయితే, రుణాన్ని పంపిణీ చేయడానికి ముందు, బ్యాంక్ అధికారికి వ్యాపార ప్రాజెక్ట్ గురించి పెద్దగా అంచనాలు లేవు. తన ఉత్పత్తిపై ఆమెకున్న విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. ఆమె అతనిని 15 రోజుల పాటు వంటసామాను ఉపయోగించడానికి అనుమతించారు. అతను సంతృప్తి చెందాడు. ఉత్పత్తిలో అవకాశాలను చూసి రుణాన్ని మంజూరు చేశారు. ఉత్పత్తి కొత్తది అయినందున వారు ఆమె ఫైల్‌ని బీవైఎస్టీ ద్వారా తరలించారు. ఆమెకు స్థిరమైన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ కూడా అవసరమని వారు భావించారు. రుణం పంపిణీ చేసిన తర్వాత, ఈ ప్రక్రియ ద్వారా ఆమెకు మార్గనిర్దేశం చేసేందుకు బీవైఎస్టీలో మెంటార్‌గా స్వచ్ఛంద సేవను అందజేస్తున్న రిటైర్డ్ బ్యాంకర్ శ్రీ ధన్‌రాజ్ తిరుముల ఆమెకు మెంటార్‌గా నియమించారు. వ్యాపారంలో అడుగడుగునా ఆమెకు మార్గదర్శకంగా నిలిచాడు. ఆమె తన ఆస్తులను నిర్వహించడం, తన ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి, ఎస్ఓపీలను ఎలా సిద్ధం చేయాలి, అలాగే సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఎలా రూపొందించాలో నేర్చుకున్నారు. ఆమె అతిపెద్ద ఆర్డర్ విలువ రూ. 65 లక్షలు!
ప్రస్తుతం ఆశా కంపెనీ ప్రత్యక్షంగా 24 మందిని, పరోక్షంగా 150 మంది ఉద్యోగులను నియమించుకుంది. మహిళలు ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను చేపట్టేలా ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగార్ధులను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడం ఆమె లక్ష్యం. చాలా మంది భారతీయ మహిళలకు వంట అనేది ప్రాథమిక నైపుణ్యం! న్యూట్రికుక్‌తో, భారతదేశంలోని మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వంటగదికి పోషకాహారాన్ని తీసుకురావాలని ఆశా కోరుకున్నారు. ఇది తాలూకాలు, జిల్లాలలో 6000 అవకాశాలను అందించడం ద్వారా ఇంటి పని వంటలను వ్యాపార నైపుణ్యాలకు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా తెస్తుంది.
ఇది మరింత మంది స్త్రీలను స్వతంత్రులను చేస్తుంది. ఆశా కంపెనీ.. నిమ్స్ నుంచి బెస్ట్ ఉమెన్స్ స్టార్ట్-అప్, మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాడక్ట్, అమిటీ యూనివర్సిటీ- ఎంఎస్ఎంఈ నుంచి బెస్ట్ బిజినెస్ ప్లాన్ వంటి అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.
పోషకాహార లోపం అనేది అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా ఉన్న దేశంలో, ఆశా "న్యూట్రికుక్" ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. అంతేకాదు ఆధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేసిన సాంప్రదాయ పద్ధతులను తిరిగి తీసుకురావడం ద్వారా చాలా మందికి పోషకాహారం తీసుకోవడం సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
సంబంధిత కథనం