Reduce Salt: కూరల్లో అనుకోకుండా ఉప్పు ఎక్కువ వేశారా? తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి
Reduce Salt: ఒక్కోసారి అనుకోకుండా ఆహారంలో ఉప్పు ఎక్కువగా పడిపోతుంది. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు గృహిణులు. అలాంటివారు ఈ చిన్న సింపుల్ చిట్కాల ద్వారా ఉప్పును తగ్గించవచ్చు.
Reduce Salt: ప్రతిరోజూ వంట చేసే మహిళలు అప్పుడప్పుడు కూరల్లో ఉప్పును అధికంగా వేస్తారు. ఒక్కసారి ఉప్పును వేశాక దాన్ని బయటికి తీయడం అసాధ్యం. అలాంటప్పుడు ఉప్పుని తగ్గించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటించవచ్చు. ఉప్పును అధికంగా తినడం కూడా ఆరోగ్యకరం కాదు. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఉప్పు అధికంగా కూరల్లో పడితే దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.
ఉప్పుని ఇలా తగ్గించుకోండి
కూరలో అనుకోకుండా ఉప్పు అధికంగా పడితే ఆ కూరల్లో క్యారెట్, బంగాళదుంప వంటి మరిన్ని కూరగాయల ముక్కలను కలపండి. ఈ రెండూ త్వరగా ఉడికే అవకాశం ఉంది. అలాగే ఇవి ఉప్పుని పీల్చుకొని తగ్గిస్తాయి. లేదా ఆకుకూరలను వేయడం ద్వారా కూడా ఉప్పు స్థాయిని తగ్గించవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే టమోటా ప్యూరీ, ఉల్లిపాయల తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వంటివి వేయడం ద్వారా ఉప్పు స్థాయిని కొంతమేరకు తగ్గించవచ్చు. కొత్తిమీర, పుదీనా వంటి వాటిని తరిగి వేయడం ద్వారా కూడా ఉప్పుగా ఉండే రుచిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే నిమ్మ రసాన్ని పిండినా కూడా ఉప్పదనం తగ్గిపోతుంది. నిమ్మరసం నచ్చకపోతే చింతపండు రసాన్ని పిండి వేయండి. ఇది ఉప్పు ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తుంది. కూర కూడా ఎక్కువ పరిమాణంలో తయారవుతుంది.
మసాలాలు ఏవైనా కూడా కూరకు అధిక రుచిని అందిస్తాయి. ఉప్పు అధికంగా పడిందంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు వంటివి మరిన్ని వేయడానికి ప్రయత్నించండి. లేదా నీళ్లు ఎక్కువగా వేసి అరగంట సేపు మరిగిస్తే ఉప్పు దానంతట అదే తగ్గిపోతుంది.
ఇంట్లో కార్న్ ఫ్లోర్ ఉంటే ఒక గిన్నెలో నీళ్లు వేసి కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు వేసి బాగా గిలకొట్టండి. ఆ మిశ్రమాన్ని అందులో వేయండి. అలా వేయడం వల్ల కూడా ఉప్పు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. లేదా కొబ్బరి పాలు, కప్పు పెరుగు వంటివి కూడా ఆ కూరలో కలిపేస్తే రుచి పెరగడంతో పాటు ఉప్పు కూడా తగ్గుతుంది. ఈ రెండూ వేయడం వల్ల కూర రుచి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.
టాపిక్