Vidaamuyarchi teaser: ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్-vidaamuyarchi teaser ajith trisha movie promises hollywood level action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vidaamuyarchi Teaser: ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్

Vidaamuyarchi teaser: ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్

Hari Prasad S HT Telugu
Nov 29, 2024 11:19 AM IST

Vidaamuyarchi teaser: అజిత్ నటించిన విదాముయర్చి టీజర్ రిలీజైంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్
ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్

Vidaamuyarchi teaser: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న విదాముయర్చి టీజర్ వచ్చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అజిత్ అభిమానులకే ప్రేక్షకులందరికీ మంచి థ్రిల్ పంచబోతోందని ఈ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఒక్క డైలాగ్ కూడా మేకర్స్ ఈ టీజర్ రిలీజ్ చేయడం విశేషం. ఇది చూసి యాక్షన్ హాలీవుడ్ లెవెల్లో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విదాముయర్చి టీజర్

విదాముయర్చి టీజర్ లో స్టోరీ ఏమాత్రం రివీల్ కాకపోయినా.. అందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. లీడ్ రోల్స్ అయిన అజిత్, త్రిషతోపాటు నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్న అర్జున్ సర్జా, రెజీనాలను కూడా ఇందులో చూడొచ్చు. ఒక నిమిషం 48 సెకన్లపాటు సాగిన ఈ టీజర్ లో ఒక్కటంటే ఒక్క డైలాగు కూడా లేదు. ఒక చోటు అర్జున్, రెజీనా గట్టిగా నవ్వే సౌండ్ తప్ప మిగతాదంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగిపోతుంది.

అయితే ఈ మూవీ మనల్ని ఓ వింత ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్లు ఇందులోని పాత్రలు, లొకేషన్లు చూస్తుంటే అర్థమవుతుంది. ఒక హాలీవుడ్ సెటప్ ఇందులో కనిపిస్తుంది. ఇక ఇందులో అజిత్ లుక్ కూడా అదిరిపోయింది. బ్లాక్ టీషర్ట్, బ్రౌన్ జాకెట్, డార్క్ సన్ గ్లాసెస్ తో అతడు డాషింగ్ లుక్ లో కనిపించాడు. త్రిషతో లవ్ స్టోరీ, ఆ తర్వాత ఫుల్ యాక్షన్, చివరికి ముఖమంతా రక్తంతో నిండిన అజిత్.. ఇలా విదాముయర్చి టీజర్ మొత్తం ఎంతో ఇంట్రెస్టింగా సాగిపోయింది.

నిజానికి గతంలోనే ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో అజిత్ ఎన్నో రిస్కీ షాట్లు చేయడం మనం చూడొచ్చు. కారు చేజింగ్ సీన్లో అతని కారు పూర్తిగా బోల్తా పడటం, అందులో నుంచి అజిత్ క్షేమంగా బయటకు రావడం కూడా కనిపిస్తుంది. ఈ సీన్లు చూసిప్పుడు తమ అభిమాన హీరో ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ అందించబోతున్నాడని అర్థమైంది. ఇప్పుడు టీజర్ దానికి ఓ గ్లింప్స్ లా కనిపిస్తోంది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ..

విదాముయర్చి టీజర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదొక టాప్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. ఏకే రాక్డ్.. కోలీవుడ్ షాక్డ్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కూడా టీజర్ కు తగినట్లుగా ఉంది. ఈ విదాముయర్చి మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.

Whats_app_banner